Hypothyroidism: పిల్లల తల్లిదండ్రులూ ఈ  విషయంలో చాలా జగ్రత్తలు తీసుకోవాలి..

Share

Hypothyroidism: థైరాయిడ్ లోపం అనేది అన్ని వయసుల వారికి వస్తుంటుంది. చాలా మంది ఇదేదో పెద్ద సమస్య అనుకుంటారు కానీ ఇది పిల్లల్లో పుట్టుకతోనూ రావచ్చు. అయితే దీన్ని గుర్తిస్తే చిన్న సమస్యే. తేలికగా అదుపు చేసుకోవచ్చు. గుర్తించకపోతేనే పెను శాపంగా మారుతుంది. లోపాన్ని గుర్తించకపోతే పిల్లలు జీవితాంతం దీని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది. జీవ క్రియలు అంటే శరీరంలోని అన్ని అవయవాల పనులను సక్రమంగా కొనసాగించడంలో థైరాయిడ్ హార్మన్లు (టీ 3, టీ 4) కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్క విషయంలో చెప్పాలంటే ఇది శరీరం మొత్తాన్ని చురుకెత్తిస్తాయి. మన మెడ ముందు భాగంలో శ్వాసనాళానికి అటు ఇటూ సీతాకోక చిలుక ఆకారంలో అంటుకొని ఉండే థైరాయిడ్ గ్రంధి నుండి ఇవి ఉత్పత్తి అవుతాయి.

Hypothyroidism:  పిల్లల్లో థైరాయిడ్ లోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించాలి

దురదృష్టవశాత్తు కొందరు చిన్న పిల్లల్లో పుట్టుకతోనే వీటి లోపం తెల ఎత్తే అవకాశం ఉంటుంది. దీంతో మెదడు సరిగా ఎదగదు. ఇతరత్రా శరీరక ఎదుగుదల దశలూ నెమ్మదిస్తాయి. అందుకే చిన్న పిల్లల్లో థైరాయిడ్ లోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సమస్య ఉన్నా మొదట్లో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు బయటపడే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మందులు వాడినా దుష్ప్రభావాలను పూర్తిగా వెనక్కి మళ్లించడం సాధ్యం కాదు. కావున పుట్టుకతో తలెత్తే థైరాయిడ్ లోపం మీద అవగాహన కల్గి ఉండాలి.

తల్లికి హైపోథైరాయిడిజమ్ ఉన్నంత మాత్రన బిడ్డకు రావాలనేమి లేదు.

తల్లికి థైరాయిడ్ సమస్య ఉంటే బిడ్డకు వస్తుందని భావిస్తుంటారు. ఇది పూర్తిగా అపోహా మాత్రమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. తల్లికి హైపోథైరాయిడిజమ్ ఉన్నంత మాత్రన బిడ్డకు రావాలనేమి లేదు. కానీ అరుదుగా కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. శిశు హైపోథైరాయిడిజం ను చిన్న రక్త పరీక్ష ద్వారా తేలికగా నిర్ధారించవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే పిల్లల తల్లిదండ్రులు పీడియాట్రిక్ ఎండో క్రైనాలజిస్ట్ లను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స చేయించుకోవాలి.

 

 

 


Share

Related posts

ఒకేసారి 70 లక్షల మంది గర్భధారణ .. వామ్మో ఇదేంట్రా బాబు !

Kumar

Chapathi: ఉదయం చేసిన చపాతీ రాత్రికి అంటే ఇన్ని ప్రయోజనాలా..!!

bharani jella

Black Rice: నల్ల బియ్యం ప్రత్యేకత ఏంటో తెలుసా..!?

bharani jella