Face Packs: సాధారణంగా అట్టు పిండి, ఇడ్లీ పిండి టిఫిన్స్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు.. మహా అయితే ఆ రెండింటినీ కలిపి ఉతప్పం వేస్తాము. కానీ అదే అట్టు, ఇడ్లీ పిండి తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.. పైగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ముందుగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న అట్టు పిండి ని తీసుకోవాలి. ఇందులో సోడా ఉప్పు కలపకూడదు. ఆ అట్టు పిండి లో కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ ప్యాక్ ను అప్లై చేసే పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
Read More: Face Packs: మీ చర్మం మెరుపు తగ్గిందా..!? వీటితో ఇలా ట్రై చేసి చూడండి చాలు..!!
ఇక ఇడ్లీ పిండి విషయానికి వస్తే.. ఇడ్లీ పిండి లో కూడా చిటికెడు పసుపు వేసి పైన చెప్పుకున్న విధంగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ పిండి లో కొద్దిగా పాలు, తేనే కలిపి ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తుకోవాలి. ఇలా చేయడం వలన ముఖానికి సహజసిద్దమైన మెరుపును సంతరించుకునెలా చేస్తుంది. చూశారుగా మనం ఇంట్లో ఉపయోగించే అట్టు, ఇడ్లీ పిండి తో ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో. మీరు కూడా వీటిని ట్రై చేయండి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.