ట్రెండింగ్ హెల్త్

Wheat: గోధుమ పిండి రోటీలు తింటున్నారా అయితే ఇది మీ కోసమే..!!

Share

Wheat: చాలా మంది బరువు తగ్గడానికి అహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. కొందరు ఒక పూట ఫ్రూట్స్ లేదా డ్రింక్స్, లేదా రోటీలు ఇలా ఏదో ఒకటి తీసుకుంటుంటారు. అయితే ఇటీవల కాలంలో చాలా మంది వారి శరీర పరిస్థితులు తెలుసుకోకుండా గోధుమ రొట్టెలు తీసుకుంటుంటారు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండే వారు గోధుమ రోటి తీసుకోకుండా ఉంటే మేలని దానికి బదులుగా వేరే రోటీలు తీసుకోవడం మంచిది అంటున్నారు.

If you are eating wheat flour breads then this is for you
If you are eating wheat flour breads then this is for you

గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వారు గ్లూటెన్ ఉన్న పదార్ధాలు తీసుకోవడం వల్ల డయేరియా, కడుపు నొప్పి, అలసట, డిప్రెషన్, మైగ్రేన్ వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పదార్ధానైనా తీసుకునేటప్పుడు దానిలో గ్లూటెన్ ఉంటుందో లేదో తెలుసుకుని తినాలి.

Wheat: గ్లూటిన్ సెన్సిటివిటీ ఎలా గుర్తించాలంటే..

కొద్ది రోజులు మీరు రోజు తీసుకునే ఆహారంలో గ్లూటెన్ ఉన్న పదార్ధాలను తీసుకోకండి, తీసుకున్న రోజుల్లో మీ శక్తి ఎలా ఉంది. తీసుకోని రోజుల్లో ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయండి. కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్దకం, మానసిక ప్రశాంతత ఇలాంటివన్నీ వాటిపై దృష్టి పెట్టండి. గ్లూటిన్ ను తీసుకున్న రోజుల్లో నొప్పులు లేక సమస్యలు అనుభవిస్తే మీకు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందని అర్థం.

గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటే గోధుమ పిండికి బదులుగా జోవర్, బాజ్రా లేదా రాగి పిండి వాడవచ్చు. వీటితో తయారు చేసిన రోటీలు కూడా గోధుమ పిండితో చేసిన వాటి మాదిరిగానే ఉంటుంది. వీటి వల్ల ఆకలి తీరుతుంది. తక్కువ సమయంలో జీర్ణం అవుతుంది. గతంలో గోధుమ పిండితో తయారు చేసిన రోటీలు తిన్న వారికి ఎటువంటి సమస్యలు వచ్చేవి కావు ఎందుకంటే అప్పట్లో అహార పదార్ధాలలో ఎటువంటి కెమికల్స్ వాడే వారు కాదు. ప్రస్తుతం పంటలు ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పండించే సమయంలో రసాయనాలు ఎక్కువగా వినియోగించడం వల్ల వాటి తత్వం మారిపోవడంతో పాటు సమస్యలు వస్తున్నాయి. సహజంగా పండించే పంటలు తింటే ఏ సమస్యలు రావు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా ఈ వివరాలు అందిస్తున్నాం, ఈ కథనం కేవలం అవగాహన కోసం వరకే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.

 


Share

Related posts

Corona: క‌రోనా సెకండ్ వేవ్ కాదు… మూడు, నాలుగో వేవ్ కూడా రెడీగా ఉండాల‌ట‌

sridhar

Big Breaking ; నీలం నిర్ణయం నెగ్గినట్టే..! డివిజన్ బెంచిలో వైసీపీకి ఊరట..! కోర్టు ఈరోజు ఏమందంటే..!?

somaraju sharma

బిగ్ బాస్ 4: పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా మెహబూబ్..!!

sekhar