ఉద్యోగం చేసే పురుషులు, స్త్రీల కు వారాంతాలు అంటే చాలా ఇష్టం.వాటికోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే పని రోజు ల్లో ఉదయాన్నే లేవడం హడావుడిగా పనులు చేసుకొని సమయానికి ఆఫీసుకు వెళ్లి, మళ్లీ ఇంటికి వచ్చి మిగిలిన పని పూర్తి చేసుకుని తర్వాత రోజుకి కావలిసిన వి సర్దిపెట్టుకుని ఎప్పుడో అర్థరాత్రికి నిద్రపోతారు. బాగా అలసట చెందిన శరీరానికి ఆ నిద్ర కూడా సరిగ్గా సరిపోదు. అందుకే వారాంతం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తారు.
ఇక వారాంతం లో ఐదు రోజుల కు సరిపడినంత నిద్ర పోతుంటారు . ఈ నిద్రతో ఒత్తిడి, అలసట అంతా పోతుంది అనుకుంటారు. కానీ అలా అస్సలు జరగదట. అలా చేయడం వలన నిజానికి విశ్రాంతి లేకపోగా అలసట ఇంకా ఎక్కువ కలుగుతుందని పరిశోధకులు అంటున్నారు.
వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై ఓ పరిశోధన నిర్వహించిన స్వీడన్ లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లోఎక్కువ సమయం నిద్రపోవడం అనేది శరీర క్రమ గతి తప్పడానికి కారణంఅవుతుందట. దీనివలన విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది వస్తుంది అని పరిశోధన లో కూడా తేలింది.
ప్రతి రోజూ నిద్ర విషయంలో ఏ పద్దతి అయితే పాటిస్తున్నారో దాన్నే వారాంతాల్లోనూ అవలంబించడం మంచిది అని పరిశోధకులు సూచిస్తున్నారు.ఇంకా కావాలంటే రోజు వారి పనుల్లో ఎక్కడ సమయం వృథా అవుతుందో చూసుకుని…సమయం వినియోగించుకుని పనులు త్వరగా చక్క బెట్టి నిద్రపోతే అది ఎంతో మంచిదని నిపుణులు తెలియచేస్తున్నారు.కేవలం వారాంతాల కోసం ఎదురుచూడడం కన్న వారం మొత్తం సమయం సద్వినియోగ చేసుకోవడం వలన అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.