House : ఇంట్లో ఉన్న అన్నిటిని ఎప్పటికప్పుడు:
ప్రస్తుతం విజృంభిస్తున్న రక రకాల వైరస్ ల కారణం గా ప్రతి ఒక్కరికి శుభ్రత మీద దృష్టి పెరిగింది. ఎప్పటికప్పుడు చేతులు ,కాళ్ళు ఇంట్లో ఫ్లోర్.. ఫ్లోర్ మ్యాట్స్ దగ్గర్నించి పడుకునే బెడ్ షీట్స్ వరకు ఇంట్లో వాడే అన్ని వస్తువులను చాలా శుభ్రం గా ఉంచుకుంటున్నారు. చాలా కొద్దీ మంది మాత్రమే సోఫాలను శుభ్రం చేస్తున్నారు.. మరి మిగతావారు దాని గురించి మర్చి పోతున్నారు. నిజానికి రోజంతా ఎక్కువ సేపు గడిపేది, వర్క్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకునేది, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఎక్కి ఆడుకునేది ఈ సోఫాలపైనే. ఇంట్లో ఉన్న అన్నిటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే మీరు, విశ్రాంతి తీసుకునే సోఫాలను మాత్రం ఎలా మర్చిపోతున్నారు ??
ఇంతమంది వాడుకునే సోఫాలు ఎన్నో రోగకారక క్రిములకు నివాస ప్రదేశం గా ఉంటున్నాయి. అందుకే సోఫాల శుభ్రతపై కూడా తగినంత దృష్టి పెట్టడం అందరి ఆరోగ్యానికి చాలా మంచిది. సోఫాలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.
House : మూలలను శుభ్రం:
ప్రతి పదిహేను రోజులకు అయినా లేదంటే కనీసం నెలకోసారైన మీ సోఫాపై ఉండే కుషన్ ను పూర్తిగా వాక్యూమ్ చేసుకోవాలి. కుషన్స్ తీసే అవకాశం ఉంటే మాత్రం తీసేసి క్లీన్ గా వాష్ చేసుకోవాలి. అదేవిధం గా సోఫా కింద ఉన్న ప్రాంతాలను కూడా శుభ్రం చేయడం లో అశ్రద్ధ చూపకండి. వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి,అన్ని మూలలను శుభ్రం చేసేసుకోవాలి. సోఫాలపై ఏమైనా మరకలు పడితే వాటిని పోగొట్టడానికి క్లెన్సర్ ను వాడి శుభ్రం చేయాలనుకున్నప్పుడు, మీ సోఫా మెటీరియల్ ను బట్టి ఎంచుకోండి.
లెదర్ కౌచ్: తోలుతో తయారుచేసిన సోఫాపై మరకలు పడితే, ఆ మరకలమీద కొంచెం తడితో మైక్రోఫైబర్ క్లోత్ ని వాడి సున్నితంగా రుద్దాలి. మరక పోవడం లేదని లెదర్ పై గట్టిగా రుద్దడం లాంటివి చేయకండి. మార్కెట్లో లెదర్ క్లీనింగ్ ప్రొడక్ట్ అందుబాటులో ఉంటే వాటిని వాడి శుభ్రం చేసుకోవాలి.ఫాబ్రిక్ కౌచ్: ఈ సోఫాలపై మైక్రోఫైబర్ క్లోత్ ను కొంచెం నీటితో తడిపిరుద్ది క్లీన్ చేయవచ్చు. నీరు కానీ ఆల్కాహాల్ శానిటైజర్ కానీ స్ప్రే చేసి స్పాంజితోరుద్దవచ్చు. ముడతలు పడినట్లుగా ఉంటే ఒక బ్రష్ తో రుద్దుతూ తిరిగి యధాతస్థితికి తీసుకురావాలి.అదే మరకలు కఠినంగా ఉంటే మాత్రం స్టెయిన్ రిమూవర్ లేదా కాస్టిల్ సబ్బు ద్రావణం వాడి మరకలను తొలగించ వచ్చు.
ఈ రకంగా సోఫాలను క్లీన్ చేసుకోవడం వలన హానికారక క్రిముల నుండి రక్షణ పొందవచ్చు.