Aloe Vera: ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గి నజుగ్గా అవ్వడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదని బాధ పడుతున్నారా.. అయితే మేము చెప్పే విధంగా కలబందను ఉపయోగిస్తే మీ బరువు ఇట్టే తగ్గిపోతుంది.మనకు తెలిసి కలబంధను చర్మ సౌందర్యం కోసం మాత్రమే ఉపయోగిస్తాం అంటే పొరపాటు పడినట్లే.కలబందను చర్మ సంరక్షణ కోసం మాత్రమే కాకుండా అనేక వ్యాధుల నివారణలో కూడా ఉపయోగిస్తారు.కలబందలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కలబంద బరువు తగ్గడంలో ఎలా ఉపయోగపడుతుందంటే..?
వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు వలన బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గుతుంది. తద్వారా బరువు చాలా వేగంగా తగ్గిపోతారు.అలాగే కలబంద రసంలో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇవి సహాయపడతాయి ఎందుకంటే అలోవెరా జెల్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి బరువు తగ్గేలా చేస్తుంది. మరి కలబందను ఉపయోగించి బరువు ఎలా తగ్గవచ్చో తెలుసుకుందామా..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కలబందలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందంటే….
ఒక గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కలబంద రసాన్ని కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగడం వలన బెల్లీ ఫ్యాట్ క్రమక్రమంగా తగ్గుతు వస్తుంది. అలాగే ఈ రెండిటి కాంబినేషన్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.అయితే ఈ జ్యూస్ ను ఎవరయినా సరే తాగవచ్చు. కొద్దిగా చేదుగా ఉన్నాగాని కలబంధ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.గ్రీన్ టీలో కలబంద రసాన్ని కలిపి పొద్దునే పరగడుపున, రాత్రి పడుకునే ముందు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి జరుగుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బరువు తగ్గడంలో అలోవెరా జ్యూస్ :
కలబంద జెల్‌ను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కలబంద గుజ్జును కూడా నిత్యం తినడం వల్ల మీ బరువు క్రమంగా తగ్గుతుంది.బరువు తగ్గాలని భావించేవారు తినడానికి ముందు కలబంద రసం తీసుకుంటే చాలా మంచిది. అంటే మీరు భోజనానికి 20 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో నిల్వ ఉండే కొవ్వు కూడా వేగంగా కరిగిపోతుంది.