Cholesterol: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి.మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగిపోతుంది. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవ్వడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువైతే చాలా రకాల శారీరక మార్పులు జరుగుతాయి.మరి శరీరంలో వచ్చే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఎవరి పాదాలు అయినా చలికాలంలో మాత్రమే చల్లగా మారతాయి. ఒకవేళ వేసవిలో కూడా పాదాలు చల్లగా మారితే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇలా పాదాలు కాలంతో పని లేకుండా చల్లగా మారితే కనుక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఖచ్చితంగా పెరిగాయని అర్ధం.ఇలాంటి సందర్భాల్లో వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మనం ఏదన్నా పని చేసిన వెంటనే అలసటకు గురికావడం సర్వసధారణమైన విషయం. అయితే ఎటువంటి శ్రమ లేకుండా శరీరం త్వరగా అలిసిపోయి, నిరసించినట్లు అనిపిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుతుందని ఒక సంకేతంగా భావించవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండె ఆరోగ్యం మెల్ల మెల్లగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఛాతీలో నొప్పి రావడం లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే ముందుగా మీ చర్మం, గోళ్ల యొక్క రంగు మారిపోతుంది. గోళ్లు కూడా పాలిపోయినట్లు కనిపిస్తాయి.అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, పాదాలు, వేళ్లు, మడమలు తిమ్మిరి ఎక్కుతాయి.అలాగే రాత్రి సమయంలో నొప్పులు కూడా వస్తాయి.అందుకేబే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకునేందుకు ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.అలాగే ఆహారంతో పాటుగా ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేయటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…