Strength: మనిషి దయ కలిగి ఉండడం అనేది ఆ వ్యక్తి తో పాటు ఇతరులకు కూడా మంచి చేస్తుంది. దయ కలిగి ఉండడం వలన ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాంమనం దయ కలిగి ఉండడం వలన సెరిటోనిన్ మరియు ఎండార్ఫిన్స్ అనే మంచి హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది. ఇది మనకు ఆనందం, ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఇలా ఉండటం వలన మనిషికి ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ మనస్సులో దయ కలిగి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఇబ్బందుల మెడకు దృష్టి వెళ్లి… పోనీలే నాకు ఈ మాత్రం అయినా ఉంది అని ఉన్నదానితో తృప్తి చెందడం మొదలయి ఒత్తిడి బాగా తగ్గుతుంది.
మనం దయ కలిగి ఉండడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దయ కలిగి ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోను విడుదల జరిగి మన రక్తనాళాల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనాన్ని బయటకు పోయేలా చేస్తుంది. గుండెను కాపాడే హార్మోన్ గా ఆక్సిటోసిన్ ని పిలుస్తారు. ఈ ఆక్సిటోసిన్ ని మన శరీరంలో విడుదల జరగాలి అంటే మనకు దయ ఉండాలి.
Strength: దయ వలన ఎలాంటి ఆందోళన, బాధ అయినా నెమ్మదిస్తుంది.
దయ చూపించడం వల్ల డిప్రెషన్ నుండి బయట పడవచ్చు.మనలో చాలామంది ఈ జీవితానికి అసలు అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు దయ చూపించడం అలవాటు చేసుకుంటే జీవితానికి ఉన్న అర్థం తెలుసుకోవచ్చు.ఇది మానవ సంబంధాలు మెరుగుపరిచి జీవితంలో అందమైన క్షణాలు ఇస్తుంది. దయ కలిగి ఉంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ గురించి మీరు గొప్పగా అనుకునేలా చేస్తుంది. దయ మీ మూడ్ ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. దయ వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం తో పాటు వయసు తగ్గుతుంది. ఎప్పుడు యంగ్ గా నే కనిపిస్తారు.మనకు దయ ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవి. మీ ఇంటి వద్ద, పనిచేసే చోట, లేదా ఎక్కడికి వెళ్ళినా దయ కలిగి ఉండండి. మన ఆలోచనల ద్వారా మన ఎమోషన్స్ ద్వారా మనం చేసే పనుల ద్వారా దయ ను చూపించవచ్చు.