చాలా మంది భార్యాభర్తలు తాము శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాం అని అనుకుంటారు కానీ వాళ్లకు తెలియకుండానే శృంగారంలోకొన్నితప్పులుచేస్తూ ఉంటారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యల దగ్గర శృంగారంలో పాల్గొనడానికి పూర్తి స్థాయిలోఅనుమతి తీసుకుని మాత్రమే మగవారు ముందడుగులు వేయటం అత్యంత ముఖ్యమైన విషయం . ఎంత భార్య అయినా కూడా శృంగార సమయం లో బలవంతం చేయడం సరైనది కాదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఒకవేళ కాదు కూడదని బలవంతంగా శృంగారం చేసినప్పటికీ పొందేది ఏమి ఉండదు. దంపతులిద్దరికీ అసంతృప్తే మిగులుతుంది. ఇద్దరు సంతోషం గా ఉండి మరొకసారి శృంగారం చేయాలనుకున్నప్పుడు పాత జ్ఞాపకాలు వెంటాడి సరిగా తృప్తి పొందలేకపోవచ్చు. అందుకే ఇద్దరూ సిద్ధం గా ఉన్నప్పుడు మాత్రమే శృంగారం చేసుకోవడం సరైనది అని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడపడితే అక్కడ శృంగారం చేయకూడదు..శృంగారం కోసం సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శృంగారం అనేది ప్రశాంతంగా ఆహ్లాదం గా జరగవలిసిన అతి ముఖ్యమైన కార్యం. రతిలో పాల్గొనే ముందు అన్నీ అనుకూలం గా ఉన్నాయో లేవో చూసుకోవడం దంపతుల ముఖ్యమైన బాధ్యత. దంపతులకు ఎక్కడ స్థిమితం గా ,ప్రశాంతం గా అనిపిస్తుందో ఆ ప్రదేశంలోనే శృంగారం చేసుకుంటే పూర్తి స్థాయిలో సంతృప్తి దొరుకుతుంది.
శృంగారం చేస్తున్నప్పుడు మగవారు తమ ఆడవారికి నొప్పి పుట్టకుండా సున్నితం గా చాలా జాగ్రత్త గా వ్యవహరించాలి.అలా చేయడం వలన ఆడవారు చాలా తృప్తి చెందుతారని అనేక సర్వేలలో వెల్లడైంది.
శృంగారం లో పాల్గొనేటప్పుడు ఒకే భంగిమ లో కాకుండా పలు భంగిమలు ప్రయత్నించడం వలన శృంగారం ఆసక్తికరంగా మారుతుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.
ఆలు మగలు శృంగారం లోఆచరించవలిసిన పద్ధతులు, తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ పరిశుభ్రతను పాటించడం, ఫోర్ ప్లే, శృంగార సంభాషణ వంటివి కూడా భార్య భర్తలు గుర్తుంచుకోవలిసిన విషయాలు గా నిపుణులు చెబుతున్నారు .