ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల శక్తి ప్రేమ. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద.ఒక బంధం చిరకాలం కొనసాగాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. ప్రేమ కొందరి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, మరికొందరిని జీవితం లో పైకి ఎదిగేలా చేస్తుంది.
ప్రేమలో గెలవడం, ఓడిపోవడం, అంటూ ఉండవు. ప్రేమ పంచిన అనుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో పదిలంగా , శాశ్వతం గా ఉండిపోతాయి. ప్రేమ అనేది ప్రతి జీవిలో ఉండే దైవత్వం.ఇంకా ప్రేమ కి ఎలాంటి శక్తి ఉందొ తెలుసుకుందాం..ప్రేమలో పడ్డారా.. ఇక మీ పనిఅయిపోయినట్టే అని ఆటపట్టిస్తుంటాం కానీ, ఆ అనుభూతి ని వర్ణించడం చాల కష్టం.ప్రేమ అనుభూతి మధురం… మధురాతి మధురం.. ప్రేమ లో ఉన్నప్పుడు ఎంత తీరిక లేక పోయిన ఎన్ని పనులున్నా సరే.. తమ ప్రేయసి, ప్రియుడ్నికలిసేందుకు మనసు తహతహ లాడిపోతుంది.
కలిసాక వారితో గడిపిన ప్రతీక్షణం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది. అయితే, అలా గడిపిన ఆ జ్ఞాపకాలు ఆనందన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.. కారణాలు ఏమైనా కూడా ఒత్తిడి కలిగినప్పుడు ఒక్కనిమిషం కళ్లు మూసుకుని మీ ప్రేమికులని వారితో గడిపిన అందమైన క్షణాలని ,వారు చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి బీపీ అదుపులో ఉంటుందని అరిజోన్ యూనివర్సిటీ మానసిక నిపుణులు చెబుతున్నారు.
రెండు విభాగాలపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేత్తలు.. ప్రేమించిన వారిని తలుచుకుని పనులు చేసినవారు మంచి పనితనం చూపించినట్టు తలచుకోకుండా పనులు చేసినవారు బీపీ పెంచుకుని గుండెవేగాన్ని పెంచుకున్నారట. అందుకే పట్టరాని కోపం, లేదా ఏదైనా ఒత్తిడి లో ఉన్నప్పుడు వెంటనే మందుల్ని ,వైద్యున్ని వెతుక్కుంటూ వెళ్లేకంటే ఈ చిట్కా పాటించి చూడమని సలహా ఇస్తున్నారు .