Sleep: నిద్ర సమస్య
ఈ రోజుల్లో మంచి నిద్ర (sleep) అనేది చాల కష్టమవుతోంది అనే చెప్పాలి. మంచి నిద్రకోసం కొన్ని చిట్కాలు చేసి చూడండి. రోజూ ఒకే టైం కి మంచం మీదకు వెళ్లే చూసుకోవాలి. ఒకే టైం కి నిద్ర పోవడం ,ఒకే టైం కి నిద్ర లేవడం వలన శరీరం ఆ సమయాలకు అలవాటు పడిపోతుంది. పలితంగా నిద్ర సమస్య అనేది ఉండదు.
Sleep: మధ్యాహ్నం మూడు గంటల తర్వాత
రోజూ లో కనీసం 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలి అదికూడా సాయంత్రం కంటే ఉదయం చేయడం వలన నిద్రకు మంచిది. ప్రతీ రోజూ కనీసం అరగంట అయినా సూర్యరశ్మి తగిలేలా ఉండడం కూడా చక్కని నిద్రకు, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కునుకు తియ్యాలి అని ప్రయత్నించకండి. పొరపాటున కునుకు తీశారో రాత్రుళ్లు నిద్రకోసం చాలా కష్టపడాల్సి వస్తుంది.రాత్రి వేళల్లో కడుపు నిండా ఫుడ్ లాగించేస్తే ఆ తర్వాత అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. కడుపు కు వెలితిగా ఆహారం (Food) తీసుకోవడం అనేది నిద్రకు చాలా మంచిది. దీనితో పాటు రాత్రి నిద్రకు ముందు నీరు ఎక్కువ తీసుకోవద్దు. నీరు తాగడం వల్ల నిద్ర మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది తర్వాత నిద్ర సరిగా పట్టకపోవచ్చు.
మద్యం తీసుకున్నప్పుడు వెంటనే నిద్ర
మత్తు పదార్ధాలు రక్తంలో ఎనిమిది గంటల పాటు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నికోటిన్ (Nicotin) కూడా శరీరాన్ని ఉత్తేజపరిచే విధం గా చేస్తుంది. కాబట్టి కాఫీ, టీ, చాక్లెట్లను నిద్రకు ఎనిమిది గంటల్లోపు తీసుకోకపోవడం మంచిది. మద్యం తీసుకున్నప్పుడు వెంటనే నిద్ర పట్టొచ్చు. కానీ నిద్ర నాణ్యత మాత్రం దెబ్బతింటుంది.అర్ధరాత్రి మెలకువ వచ్చేస్తుంది. అలాగే సాయంత్రం తర్వాత కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. వేడి నీళ్లతో స్నానం కూడా మంచి నిద్రకు కారణం అవుతుంది. వేడినీటి స్నానానంతరం శరీర ఉష్ణోగ్రత (Body Temperature) ఒక్కసారిగా తగ్గి బాగా నిద్ర వస్తుంది.