weight loss: బరువు తగ్గాలంటే  అన్నిటి కంటే ముందు ఈ విషయం మీద దృష్టి పెట్టండి… మంచి ఫలితం వచ్చి తీరుతుంది !!

Share

weight loss:  బరువు పెరగటానికి  ఉన్న కారణాలలో ముఖ్యమైన కారణం సమయానికి  ఆహారం తినకపోవడం. ఇలా చేయడం వలన  బరువు  కచ్చితంగా పెరుగుతారు అని అంటున్నారు  ఆరోగ్య నిపుణులు. అలాగే మనం తినే  ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే, అప్పటికి బాగానే ఉన్న  ఒక వయస్సు దాటిన తరువాత  అధిక బరువుకు చేరుకుంటారు అని తెలియచేస్తున్నారు.అధిక బరువు తో పాటు అనారోగ్య సమస్యలకు  దూరంగా ఉండాలంటే,  ప్రతి రోజూ ఒకే సమయానికి  సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం  తప్పనిసరి.

ప్రతి రోజూ ఉదయాన్నే బలవర్థకమైన టిఫిన్ ఎదో  తిన్నాం అనిపించకుండా, కాస్త ఎక్కువగానే లాగించేయమంటున్నారు న్యూట్రీషియన్స్ . ఇలా చేయడం   జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి,   ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ప్రతి రోజూ   తినే  ఆహారాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి.  అందులో సగభాగం  తాజా కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి అని ,  ఇక మిగిలిన సగం లో ఒక పావు భాగం పప్పు దినుసులు, మరో పావు భాగం  మాంసకృత్తులు ఉండేలా సిద్ధం చేసుకోవాలి అని సూచిస్తున్నారు.కొన్ని,కొన్ని పరిస్థితులలో దాహం వేస్తున్న  కూడా ఆకలిగా  ఉందనుకుని ఎక్కువగా  తినేస్తుంటారు. అందుకే  మీకు ఎప్పుడు  ఆకలిగా  ఉన్న  ముందు ఓ గ్లాస్  నీరు  తాగాలి. దీని తర్వాత భోజనం చేస్తే ఆహారం కాస్త తక్కువగా తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో  ఒక పూట ఆహారం తీసుకోక పోయినా,బాగా ఆకలేస్తుంది. అలాంటపుడు ఆకలేస్తుంది కదా అని తొందర తొందర గా తినేస్తుంటారు. దీని వల్ల ఎంత తింటున్నామనే తెలియదు. కాబట్టి నెమ్మదిగా, బాగా నమిలి,నమిలి తినడం వలన ఎక్కువగా తినే ప్రమాదం ఉండదు.
అలాగే,  రోజు మొత్తం లో  కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలని  ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.  సాయంత్రం నాలుగు గంటల  సమయానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. ఆ  సమయం లో  స్నాక్స్ తప్పనిసరిగా  తినాలి. తక్కువ కేలరీలు ఉన్న బాదామ్ లాంటి స్నాక్స్ గా తీసుకుంటే  చాలా మంచిది.

ఏదైనా పరిస్థితిలో  ఇంట్లో కాకుండా బయట ఆహారం  తీసుకోవాల్సి వస్తే ముందు ఫ్రూట్ సలాడ్లేదా ఏదైనా సూప్‌గానీ తీసుకోవాలి. ఆ తర్వాత భోజనం చేయడం మంచిది. దీనివల్ల హై క్యాలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా  తీసుకునే అవకాశం ఉండదు. భోజనం ముగించిన తర్వాత    ఐస్‌క్రీమ్, కేక్ లేదా పాయసం  ఇలాంటి వాటికి దూరంగా  ఉండటం మంచిది .


Share

Related posts

MP RRR Case: ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు..!!

somaraju sharma

Today Horoscope సెప్టెంబర్ 24th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Ys Jagan Mohan Reddy : జగన్ తీసుకునే నిర్ణయానికి టెన్షన్ పడుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు..??

sekhar