నవ్వితే నాలుగు విధాలా చేటు అనడం పాత రోజులు. ఇప్పుడు నవ్వకపోతేనే 40 విధాలా ఆరోగ్యానికి చేటు వస్తుంది.
మితిమీరిన ఒత్తిడి, పోటీతత్వం లాంటి సమస్యలు మనల్ని నవ్వు నుంచి దూరం చేయడమే కాదు నవ్వునే మరిచపోయేలా చేస్తున్నాయి. నలుగురితో కబుర్లు చెబుతూ కాసేపు నవ్వుకోవాలన్నా.. పని ఒత్తిడి వల్ల సాధ్యం కావడం లేదు . అయితే, నవ్వకపోవడం వల్ల ఏం కోల్పోతున్నామో తెలుసుకోవాలి. మనకు వచ్చే జబ్బుల్లో 70 శాతం ఒత్తిడి వల్ల ఏర్పడేవే.
డయబెటీస్, డిప్రెషన్, గుండె జబ్బులు, రక్తపోటు, ఇన్సోమియా, మైగ్రేన్, ఆతృత, అలర్జీ, పెప్టిక్ అల్సర్ తదితరాలన్నీ ఒత్తిడితో సంబంధం ఉన్నవే . ఇవి రాకుండా ఉండాలంటే నవ్వితిరావలిసిందే. నవ్వు వల్ల ఆందోళన దూరమై, ఒత్తిడికి కారణమయ్యే హార్మోనులు స్రవించడం తగ్గుతుందంట .
తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.
పది నిమిషాలు నవ్వడం వల్ల 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందట. నవ్వు వల్ల రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది.
నవ్వడం వల్ల ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులు దరిచేరవు.
నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతాయి.
ఆస్తమా రోగులకూ సైతం నవ్వు చాల మంచిది. నలుగురితో కలిసి సరదాగా నవ్వేవారికి, ఒంటరిగా ఉండే వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఓ సర్వేలో తేలింది.
నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారుగా … అందుకే హాయిగా మస్ఫూర్తిగా నవ్వండి.. హాయిగా జీవించండి.