మీ పిల్లలు ఆన్లైన్ లో క్లాస్ లు వింటున్నారా?? అయితే ఇది మీకోసమే..

సాధారణంగా తల్లిదండ్రులకి తమ పిల్లలు ఫోన్ లేదా ఇతర గాడ్జెట్స్ కి అలవాటు పడిపోతారేమో అనే భయం ఉంటుంది . పిల్లలు కూడా వయసు పరిమితి లేకుండా, అంటే 1 సంవత్సరం పిల్లల దగ్గరనుండి   కాలేజీ పిల్లల వరకు ఫోన్ వదలడం లేదు..

మీ పిల్లలు ఆన్లైన్ లో క్లాస్ లు వింటున్నారా?? అయితే ఇది మీకోసమే..

కరోనా కారణంగా ఫోన్ లోనే క్లాసెస్ జరుగుతున్నాయి..  ఒకవేళ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తారో అనే భయం కూడా  చాలా మంది తల్లిదండ్రులకి ఉంది . కాబట్టి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి అని అంటున్నారు నిపుణులు.గమనించడం అంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ టీచర్ ఏం చెప్పారో చెప్పమని అడగాలి. అలాగే ఆ రోజు పూర్తి  అయిన పాఠాలని చదివించి తిరిగి వాళ్ల చేత చెప్పించడం వంటివి చేయాలి.

పదవ తరగతి లోపు పిల్లలకు అయితే, ఫోన్ పరిమితి మించి ఇవ్వద్దు అని, వీలుంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు పిల్లల పక్కనే కూర్చోవాలి అని అంటున్నారు.వీటితో పాటు  వీలున్నప్పుడు పిల్లలతో కొంత సమయం గడపడం కూడా మంచిది అని అంటున్నారు. పిల్లల తో కలిసి బయటికి వెళ్లడం, ఎక్సర్సైజ్ చేయడం,స్నేహ పూర్వకంగా ఉండడం చేస్తే తల్లిదండ్రులకి కూడా తమ పిల్లల ప్రవర్తన పై పూర్తి అవగాహన కలగడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందట.

కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ విషయంలో, లేదా పిల్లల చేతిలో ఫోన్ ఉండే విషయంలో కూడా అవగాహన వస్తుందట.పిల్లలని పెంచడం అనేది తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు. ఆబాధ్యతను మనస్ఫూర్తిగా చేయాలిగాని ఆందోళనతోకాదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన మీకు పిల్లల కు మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.