హెల్త్

menstrual: మీ రుతుస్రావం  ఈ రంగు  ల్లో ఉంటే    పెద్ద సమస్య ఉన్నట్టే… వెంటనే డాక్టర్ ని సంప్రదించండి!!(పార్ట్ -2)

Share

menstrual: ఒకవేళ మీ  బ్లీడింగ్ బూడిద లేదా నలుపు రంగులో  ఉంటే  అది చాలా పెద్ద సమస్య అని గమనించాలి. ఇలాంటి బ్లీడింగ్  జరుగుతున్నప్పుడు  స్త్రీలు  చాలా నొప్పితో బాధ పడుతుంటారు. ఇలాంటి వారికి గర్భధారణ సమయంలో  చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పీరియడ్స్ వస్తున్నాయంటే ,ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ సమస్య  ఉండి ఉన్నట్టు గమనించాలి.    గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియం అనే పొర గర్భాశయం బయట పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు . ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నెలసరిలో చాలా ఎక్కువ నొప్పి  వస్తుంటుంది.   శృంగారం  సమయంలో కూడా చాలా ఎక్కువ నొప్పి వస్తుంది అంటే,  ఎండోమెట్రియోసిస్ అని అనుమానించవచ్చు.

ఒకవేళ మీ  బ్లీడింగ్  గులాబీ రంగులో ఉంటే.. మీరు తగినంత పోషకాహారం తీసుకోవట్లేదు అని అని గుర్తు. లేదా మీ శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి తక్కువగా ఉండడం కూడా  కారణం  అయి ఉండవచ్చు. ఇలాంటి బ్లీడింగ్ జరిగినప్పుడు  జీవన విధానంలో  మార్పులు  చేసుకుని…  ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుండాలి.

పిరియడ్ వచ్చే ప్రతి సారి    గర్భసంచి లోపల ఉన్న పొర  ఊడి   కొత్త  రక్తంతో కలిసి బయటకు పంపబడుతుంది. పొర కాబట్టి చిన్న చిన్న గడ్డలు గా అనిపించడం    సహజమే..   అయితే  ఈ గడ్డలు మరీ పెద్దగా ఉంటే మాత్రం, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది హార్మోన్ల అసమతుల్యత కారణంగా  జరుగుతుంటుంది. కొన్ని సార్లు  ఈ పెద్ద పెద్ద రక్తపు గడ్డలు ముదురు ఎరుపు రంగులో కూడా ఉంటాయి. ఇలాంటివి  అండాశయాల్లో  సిస్టులు ఉన్నట్టు సూచిస్తాయి. ఇలాంటివి కనిపించినప్పుడు హార్మోన్ల అసమతౌల్యతను నివారించడానికి  డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం  అవసరం.


Share

Related posts

Tooth Pain: ఈ చిట్కాలతో పంటి నొప్పి మాయం..!

bharani jella

ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే డెలివరీ తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. (పార్ట్-2)

Kumar

వయాగ్రా ను మించిన పవర్ మీకు కావాలంటే ఇలా చేసి చూడండి… ఇక మీకు తిరుగే ఉండదు !! (పార్ట్ -1)

siddhu