ప్రేమ లో పడినప్పుడు కలిగే ఆనందం గురించి చెప్పడానికి మాటలు చాలవు . అస్సలు ఆ ఆనందం మరే విషయంలోనూ కలుగదు కూడా. చాలా మంది ప్రేమ లో ఉన్నప్పుడు ఈ లోకం మొత్తాన్ని జయించినంత గొప్పగా అనుకుంటుంటారు . ప్రేమ గురించి చెప్పే కొందరైతే ప్రేమకు ఎలాంటి జబ్బునైనా మాన్పించే శక్తి ఉందంటారు. ప్రేమ పై వారి కున్న అభిమానంతోనే ఈ మాట అంటారని మనం పెద్దగా పట్టించుకోము.
కానీ నిజం గా ప్రేమకు అంతటి శక్తి ఉందని దానిలో భాగంగా ఎన్నో అనర్థాలకు కారణం అయినా మద్యపాన అలవాటుని కూడా మాన్పించే శక్తి ప్రేమకు ఉందంట. అది ఎలా అనుకుంటున్నారా … మనిషి శరీరం లో ప్రేమ కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మన్ కారణం గా మద్యం తాగాలనిపించదట.. ఈ కారణం గా నెమ్మదిగా ఈ అలవాటు కు దూరమవుతారు అని అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తం గా పరిశోధించి మరి ఈ విషయంతెలియచేసారు. మొట్టమొదట వారు కొన్ని ఎలుక ల కి ఆల్కహాల్ అలవాటు చేసి అనంతరం.. వాటి ముక్కు భాగం లో ఆక్సిటోసిన్ స్ప్రే చేశారు.. తర్వాత పరీక్షించి చూడగా అవి మద్యానికి దూరంగా ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
అందుకే మీ భాగస్వామి తాగుడికి అలవాటు పడ్డారని బాధ పడిపోవద్దు.. వారిని వీలైనంత ఎక్కువగా ప్రేమించండి.. ఆ ప్రేమ వారిచేత మందు ని మాన్పించేస్తుందంటూ సలహా కూడా ఇస్తున్నారు.. ఇంత తేలికైన పద్దతి మీ ముందు ఉంటే ఇంకా ఎందుకు ఆలోచన..ప్రేమ లో మునిగి తేలండి.. మద్యపానాన్ని దూరం చేయండి..