ఇమ్మ్యూనిటీని పెంచే అద్భుతమైన పదార్ధాలు ఇవే!

వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల మనకు అనేక రకాల జబ్బులు వ్యాపించడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇలాంటి రకాల వ్యాధులను అరికట్టడానికి మన శరీరానికి ఇమ్యూనిటీపవర్ ఎంతో అవసరం. ఈ సీజన్ లో మనం ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో తరుచుగా బాధపడుతూ ఉంటాము.

 

ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఎన్ని రకాల మందులు వాడుతున్న ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ఇక ఆ సమయంలో సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే, మన ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే పదార్థాలను తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా, తరచూ ఇలాంటి జబ్బుల బారిన పడరు. అయితే ఆ పదార్థాలు ఏమిటి? ఎలా వాడాలి? అన్న విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే వాము, అల్లం, మిరియాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా మన శరీరంలో అధికంగా ఉన్న ఫ్రీరాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లు ఈ వాము, మిరియాలలో మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా మిరియాలలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గించడంలో ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది.

కొద్దిగా అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఈ మూడింటిని బాగా వేడి నీటిలో మరిగించి ఆ నీటిని వడ పోసి వాటి లో కొద్దిగా తేనె కలుపుకొని తాగడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఈ కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ కషాయాన్ని తరచు తక్కువ పరిమాణంలో తాగుతూ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ కషాయం ఆహారం అరుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలలో అధికంగా గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ వామును తీసుకోవడం ద్వారా వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇంకేందుకు ఆలస్యం ఇటువంటి చిట్కాలను పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకోండి.