Pranayama : మన డైలీ లైఫ్ లో ఎలాంటి సందర్భాల్లో ప్రాణాయామం చేస్తే అధ్బుతమైన ఫలితాలు పొందగలుగుతామో తెలుసుకుందాం.
1. ఆహారం తీసుకునే సమయాలలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినడానికి ముందు ప్రాణాయామం చేయండి. తినేముందు ప్రాణాయామం చేయడం వల్ల మీరు ఎంత తింటున్నారో మీకు తెలిసి మీ శరీరానికి కావలసినంత మాత్రమే తింటారు. మీ శరీరంలో ప్రాణం నిండి ఉన్నప్పుడు మీరు కావలిసినదానికన్నా ఎక్కువ తినలేరు. దీనివలన మీరు సరిపడినంత బరువు మాత్రమే ఉంటారు.
2. పడుకునే ముందు ప్రాణాయామం చేయడం వలన ప్రశాంతమైన స్థితి కి చేరుకొని మీరు మంచి నిద్ర లోకి వెళ్తారు.
3.వర్క్ ప్లేసెస్స్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేస్తే మంచి ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో సమయం గడపగలుగుతారు.
4. ఇంటర్వ్యూ లేదా ఏదైనా పరీక్ష ఉన్నప్పుడు టెన్షన్ , ఆందోళన అనేవి చాలా సహజం. అలాంటి సమయంలో ప్రాణాయామం చేస్తే మైండ్ ప్రశాంతం గా మారి ఆ పరిస్థితులను సమర్థవంతంగా ఎదురుకుంటారు .
5. ఎవరైనా మీకు కోపం తెప్పించినపుడు అప్పటికప్పుడు ఎదురుతిరగకుండా కాస్త టైం తీసుకుని ప్రశాంతంగా ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు అవతలి వారితో మాట్లాడండి.అప్పుడు ఎలాంటి తొందర పాటు మాటలు, చర్యలు జరగకుండా ఉంటాయి.
6. మీరు AC లో పని చేస్తూ ఉంటే మాత్రం అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుని బయటకు వెళ్లి ప్రాణాయామం చేసి మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడం మంచిది.
ప్రాణాయామం ద్వారా రీచార్జ్ చేసుకోవడానికి ఇవి కొన్ని మార్గాలు.
మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఇచ్చేది ప్రాణాయామం. మనం తీసుకునే శ్వాస యొక్క గాఢత మరియు వేగం మీద మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. కాబట్టి గాఢమైన శ్వాసని మెల్లగా తీసుకోండి. శ్వాసను క్రమబద్దం చేసుకోండి.