పొద్దున్న నిద్ర లేచాక తీసుకునే అల్పాహారం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది మెటాబాలిజాన్నినింపి రోజంతా యాక్టివ్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.
మంచి బ్రేక్ ఫాస్ట్ వల్ల మళ్ళి ఆహారం తీసుకునేవరకు బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. అల్పాహారం అతిగా తినకూడదు అలాగే మరీ తక్కువగా తినకూడదు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ చేర్చుకోవడంవల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు పొందవచ్చని వివిధ స్టడీస్ చెబుతున్నాయి.మంచి పోషకాలు నిండిన బ్రేక్పాస్ట్ తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి పెరిగడమే కాక.. అధికబరువుని ఈజీగా తగ్గించుకుకోవచ్చు.
మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్ ఉండాలి. దీనివల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. మెటబాలిజం మెరుగవవుతుంది. అలాగే ఆకలి తగ్గుతుంది. ప్రోటీన్ వల్ల బరువు తగ్గడం కూడా జరుగుతుంది. ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారో వారు బ్రేక్‌ఫాస్ట్ చేయని వారితో పోల్చితే సన్నగా ఉన్నట్టు తేలిందని స్టడీస్ చెబుతున్నాయి.
అలాగే, బ్రేక్‌ఫాస్ట్ ను స్కిప్ చేయకుండా రెగ్యులర్ గా తీసుకున్న వారిలో బ్రేక్‌ఫాస్ట్ చేయని వారితో పోల్చితే ఆరోగ్యకరం గా బరువు తగ్గారని తెలిసింది. బ్రేక్‌ఫాస్ట్ తో బరువు తగ్గుతుందని భావించి మీరు హెవీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని శారీరక శ్రమ లేనట్టయితే ఫలితం ఉండదుకాబట్టి, బరువు తగ్గడానికి సహాయపడే అన్ని విషయాల పైన శ్రద్ద పెట్టడం ముఖ్యం.
మీరు తీసుకునే అల్పాహారంలో అధికంగా ఫైబర్, ప్రోటీన్లను కలిగిన ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే మంచిది.తృణధాన్యాలను, తక్కువ కొవ్వు కలిగిన పాలను కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్లతో పాటు ఫైబర్ శరీరానికి అందుతుంది. చపాతీ, జొన్న రొట్టెలో ఎక్కువగా కూరగాయాలతో చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీసుకోవాలి.