పొట్ట లోపలకి ఉండి సన్నని నడుముతో అందంగాఉండాలని ఎవ్వరు మాత్రం కోరుకోరు . అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ జంక్ ఫుడ్స్ కి, ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటుపడిపోవడం తో పాటు శారీరక శ్రమ కూడా లేకపోవడం తో పొట్టచుట్టూ.. నడుము చుట్టూ రింగ్ లాగా కొవ్వు బాగా పెరిగిపోతోంది.
ఇక ఆ పెరిగిన కొవ్వు తగ్గించడానికి ఎంత వ్యాయామం చేసిన ఎన్ని జిమ్ ల చుట్టూ తిరిగినా.. బరువు తగ్గించే సెంటర్లకు తిరిగి బోలెడు డబ్బు ఖర్చు చేసినాకూడా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.మనం తీసుకునే ఆహారంలో కొన్నిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం.. పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం వంటివి జరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరి ఆహారం లో చేసుకోవాలిసిన ఆ మార్పులు గురించి తెలుసుకుందాం … బరువు తగ్గాలి అనుకునేవారికి గోరువెచ్చని నీరు తాగడం సరైన మార్గం. ఇది జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వుణాలను విఛిన్నంచేస్తుంది. దీని వలన అధిక బరువు పెరగకుండా ఉంటుంది. దబ్బ పండు(గ్రేప్ ఫ్రూట్).. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది.
క్యాలరీలు తక్కువ న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉంటాయి.ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతోంది. దీనిలో ఉండే న్యూట్రీషన్స్ బరువు సులభంగా తగ్గడానికి ఉపయోగపడతాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం తో కొవ్వు త్వరగాతగ్గుతుంది. అంతేకాకుండా.. ఇవి ఎక్కువగా తినడం వల్ల గుండె కి సంబంధించిన సమస్యలు కూడా రావు.. ఇదిపొట్ట కి ఉన్నకొవ్వు ని బాగాతగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే మరో పండు ఆపిల్.ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను, ఇతర కొవ్వు సంబంధిత పదార్థాలను శరీరం గ్రహిస్తుంటుంది.
యాపిల్స్‌ని తినడం వలన , దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థాల పేరుకోనివ్వకుండా అడ్డుకుంటుంది. ఈ ఆపిల్ తినడము నడుముకి మంచిది . ఇది పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో కీలక మయినది .బీన్స్ ప్రోటీన్ కలిగిన మంచి ఆహారం. జీవక్రియను పెంచుతుంది తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడంలో ఈ ప్రోటీన్ చాల ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ఆహారం తో పాటు కొన్ని గింజలు తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అవిసె, గుమ్మడి,పుచ్చ, పొద్దుతిరుగుడు, నువ్వులు మొదలైన గింజలు ప్రోటీన్ ,ఫైబర్, మరియు ఇతర పోషకాలతో ఉంటాయి. వీటిని తినడం వల్ల అతిగా ఆహారంతీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొట్ట దగ్గర కొవ్వును నివారించడంలో ఇవి చాల బాగాపనిచేస్తాయి.
పెరుగు తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు ను తగ్గించంలో ఇది కీలకంగా పనిచేస్తుంది..బరువు తగ్గడానికి కావాలసిన కీలకమైన మాక్రోన్యూట్రియెంట్ పెరుగులో ఎక్కువగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలి అంటే మాత్రం సాధారణ పెరుగు వాడాలి. అదే మీగడ పెరుగు తింటే.. కొవ్వు పెరిగిపోయే ప్రమాదం ఉంది.వీటితోపాటు బరువు తగ్గడానికి బెర్రీలు, బాదంపప్పులను కూడా ఆహారంలోచేర్చుకోవాలి.వారం లో ఐదు రోజులు 30 ని పాటు వాకింగ్ చేయడం వలన చాలా త్వరగా బరువు తగ్గుతారు ..