Gratitude journal: కృతజ్ఞత తెలియచేయడం అలవాటు  చేసుకుంటే..  జీవితం లో  మీరు నమ్మలేనటువంటి  అద్భుతమైన మార్పు కలుగుతుంది!!

Share

Gratitude journal:  ఈ విధం గా కృతజ్ఞతని అలవాటు చేసుకోవడం వలన మన జీవితం  ( Life )ఎంతో అద్భుతం గా మారుతుంది కాబట్టి కృతజ్ఞతని అలవాటు చేసుకుని చూడండి..  ఈ కింద తెలిపిన పద్దతుల ద్వారా కృతజ్ఞతని అలవాటు చేసుకోవచ్చు.
1. పడుకునే ముందు ప్రశాంతం గా అలోచించి  మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాలకు  ఆ దేవుడికి కానీ  విశ్వానికి థాంక్యూ అని  చెప్పండి.
2. ఉదయం  నిద్ర లేచిన తర్వాత కూడా  మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాల గురించి మరియు నిద్రలో అలసట పోగొట్టి తిరిగి మీ శరీరం లో శక్తిని నింపినందుకు ఆ దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ చెప్పండి.
3.  మీరు ఏది తింటున్న   లేదా మంచి నీళ్ళు తాగుతున్నప్పుడు అయినా  దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ చెప్పండి.

4.గ్రాటిట్యూడ్ జర్నాల్( Gratitude journal )పెట్టుకుని ప్రతీరోజూ మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాలు రాయండి.

5. మీ కుటుంబ సభ్యులు మీకు చేసిన దానికి కృతజ్ఞత తో ఉండండి. . ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరన్నా మీకు రుచి కరమైన  భోజనం చేసి పెడితే అందులో మీకు ఏం నచ్చిందో చెప్తూ వాళ్ళకి మీ కృతజ్ఞతని తెలియచేయండి.
6. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళకి కృతజ్ఞత  తెలియచేస్తూ  వాళ్ళ వల్ల మీ జీవితం ఎలా మారిందో వాళ్ళకి చెప్పండి.
7. మీరు  జీతం  లేదా వ్యాపారం లో లాభం వచ్చిన  ప్రతీసారి దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ అని చెప్తూ ఉండండి.
8. మీకు నచ్చిన పని చేసిన ప్రతీసారి మీ మీద  మీరే కృతజ్ఞత చూపించుకోండి

జీవితంలో కృతజ్ఞతని అలవాటు చేసుకోవడానికి కొన్ని పద్దతులు ఇవి. మీరు ఇలా చెప్పడం ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ప్రతీరోజూ ఇంకా ఇంకా మంచి  మార్పులు మీ జీవితం లో వాస్తు మరింత మంచి వ్యక్తిగా మారుతుంటారు. మీరు  పూర్తిగా పాసిటివ్ గా ఉండే వ్యక్తిగా మారతారు. అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మరింత  ప్రేమగా ఆనందంగా ఉంటారు.
ఇప్పటి నుండే  కృతజ్ఞతని చూపించడం మొదలు  అధితమైన ఆనందాన్ని జీవితాన్ని పొందండి.


Share

Related posts

జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే పిల్లలు పుట్టడం కష్టమే!

Teja

మీకు దగ్గరగా ఉన్నవారు మాస్క్ పెట్టుకోవడం లేదా? అయితే అంతే సంగతులు!

Teja

Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!

bharani jella