న్యూస్ హెల్త్

ఆ రేస్ లో ఇంటింటి గృహలక్ష్మి వెనక్కి తగ్గిందా.!? వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఇదేనా !? 

Share

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ కథనం ఊహించని మలుపులు తిరుగుతూ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది బుల్లితెర ప్రేక్షకులకు.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 12.04 రేటింగ్ను సొంతం చేసుకొని థర్డ్ ప్లేస్ లో నిలిచింది.. గతవారం ఈ సీరియల్ రెండో స్థానంలో నిలవగా ఈ వారం మూడవ స్థానానికి పడిపోయింది.. కానీ గత వారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ లో మాత్రం చాలా ఎక్కువ.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!?

తులసి పాత్రే ఈ సీరియల్ కు మూలం.. ఇన్ని రోజులుగా తులసిని ఓ వంటింటి గృహిణిగా పిల్లల బాధ్యతలు అత్తమామల సేవలు చూసుకుంటూ గడిపేసింది.. కానీ తులసిలో ఓ చక్కటి గృహిణి మాత్రం తన భర్త నందుకు ఏమాత్రం నచ్చలేదు.. తనని మార్చుకునే ప్రయత్నం కూడా నచ్చలేదు.. తన అభిరుచులకు తగిన తన ఆఫీసులో పనిచేస్తున్న మరో అమ్మాయిపై మనసు పడ్డాడు.. ఆ విషయం అక్కడితో ఆగకుండా వాళ్ళిద్దరి పెళ్లి వరకు అది దారితీసింది.. తులసి కూడా తన భర్తలో మార్పు తీసుకురావడం కష్టమని.. ఇలాంటి వారిని వదిలేయడం తప్ప దగ్గర పెట్టుకుని పూజించడం దండగనుకొని తన భర్తకు విడాకులు ఇచ్చి.. తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది..

 

ఎప్పుడైతే తులసి తన భర్త నుంచి విడాకులు తీసుకుందో.. అప్పటి నుంచి తను సొంతంగా ఎదగాలని తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని.. ఎవరు మీద ఆధారపడకూడదు అని నిర్ణయించుకుంది.. తనకు ఉన్న పరిజ్ఞానంతో చిన్న టైలరింగ్ యూనిట్ ని స్థాపించి దాన్ని ఓ పెద్ద సంస్థగా మార్చుతుంది.. అక్కడ కూడా లాస్య తన పెత్తనాన్ని చలాయించాలని అనుకుంది తన వల్ల ఎంతో మంది అభాగ్యులకు ఆ యూనిట్ ద్వారా ఆదాయం చేకూరేలాగా తులసి చేసింది.. కానీ లాస్య చేసిన కొట్రకు తులసి ఆ యూనిట్ నుంచి పక్కకు తప్పుకుంది. తనలో ఉన్న సంగీతం కలకు మెరుగులు దిద్ది ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు దానినే సంగీతం స్కూల్ గా మార్చేందుకు తన కథను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది. ఒక బిజినెస్ పర్సన్తో చేతులు కలిపి ఇద్దరి మీద మ్యూజిక్స్ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది తులసి..

 

మొత్తానికి తులసి అనుకున్న మ్యూజిక్ స్కూల్ భూమి పూజ ఫంక్షన్ వరకు వచ్చేసింది. లాస్య మాత్రం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోదు . ఏదో విధంగా ఈ భూమి పూజ జరగకుండా తులసి మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయకుండా అడ్డుకోవాలని అనుకుంటుంది. తన ప్లాన్ ను అవి వివరించి ఇలా చేస్తే మీ అమ్మ పరువు, కుటుంబ పరువు పోకుండా ఉంటుంది.. అని చెప్పి తన పంతాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. లాస్యకు తగిన గుణపాఠం చెప్పడానికి తులసి వాళ్ళ అన్నయ్య రంగంలోకి దిగుతాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడతానని తెలుసుకున్న లాస్య.. ఎలాగైనా తులసి అనే వాళ్ళ అన్నయ్య భార్య నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.. తులసి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. కాకపోతే సామ్రాట్ ను తులసిని పెళ్లి చేసుకోమని అని అడుగుతుంది ఇదే వచ్చేవారం ఊహించని ట్విస్ట్..


Share

Related posts

Nara Lokesh: తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్ ..జగన్ కి సవాల్..!!

somaraju sharma

ఐపిఎస్‌పై సిబిఐ లుక్అవుట్

somaraju sharma

ప్రణయ్ ని చంపినందుకు మా నాన్న పశ్చాతాప పడుంటాడు

Siva Prasad