Mouth Ulcer: నోటి పూత రాకుండా ఉండాలంటే ఇవి తినాలి..!!

Share

Mouth Ulcer: నోటి పూత సమస్య చిన్నదే కానీ దాని వలన వచ్చే నొప్పి మాత్రం వర్ణనాతీతం..!! దాంతో ఏమీ తినలేము, తాగలేము.. పైగా తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా కూడా అనిపిస్తుంది.. మౌత్ అల్సర్ అంటే కొంతమంది భయపడిపోతుంటారు..!! ఈ సమస్య వచ్చాక బాధపడటంకంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! నోటి పూత రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాలి..!!

Iron And Folic Acid Foods to check Mouth Ulcer:
Iron And Folic Acid Foods to check Mouth Ulcer:

మౌత్ అల్సర్ రాకుండా ఉండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకున్న వెంటనే నోటిలో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నోటి పూత రావటానికి ఐరన్ లోపం కూడా ఒక కారణం. అందువలన ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. నువ్వులు, కిడ్నీ బీన్స్, గుమ్మడి కాయ విత్తనాలు, ఎండుద్రాక్ష, డాట్ చాక్లెట్స్, ఓట్స్, వేరుశెనగ గింజలు ను తరచూ తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్ మీ డైట్ లో భాగం చేసుకోవాలి.

Iron And Folic Acid Foods to check Mouth Ulcer:
Iron And Folic Acid Foods to check Mouth Ulcer:

ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా సహాయపడుతుంది. బీన్స్ ఉత్పత్తులలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది అందువలన వీటిని తరచూ తీసుకోండి. బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్ ను ఎక్కువగా తినాలి. ఇక ఆకుకూరల విషయానికి వస్తే తోటకూర, పుదీనా, పాలకూర లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బ్రోకలీ, క్యాలీఫ్లవర్, బెండకాయ, క్యాప్సికం, బీట్రూట్ కూరగాయలను తరచూ తీసుకుంటూ ఉండాలి. బొప్పాయి, నారింజ, అవకాడో, అరటి పండ్లు తీసుకోవాలి. గుడ్లు, చికెన్ లివర్ లో కూడా పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఫోలిక్ యాసిడ్ శరీరానికి సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా మౌత్ అల్సర్ రాకుండా చేస్తుంది.


Share

Related posts

‘నన్ను చంపేస్తారు’ అని సుశాంత్ ఎప్పుడూ వాళ్లను చూసి భయపడేవాడు..! అతని చనిపోవడానికి ముందు ఏం జరిగిందంటే….

arun kanna

Aadhaar card : మీ ఆధార్ కార్డు ను ఎవరు వాడుతున్నారో తెలుసుకోండిలా..!!

bharani jella

సీఎం జగన్ X జస్టిస్ రమణ ; జగన్ పై పిటిషన్ సరే..! లేఖ సంగతి ఏమైనట్టు..!?

Srinivas Manem