Cooking oil: ఈ రోజుల్లో ఆహారం తయారు చేయడానికి కొన్ని కొన్ని హోటళ్ల లో, రెస్టారెంట్ లో, కొందరి ఇళ్లలో సైతం ఎక్కువగా వాడుతున్న ఆయిల్.. పామ్ ఆయిల్. ఇది చాలా ప్రమాదకరమైనది. మద్యం, స్మోకింగ్ ఆ రెండూ కలిస్తే వచ్చే నష్టం కన్నా … పామ్ ఆయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ప్రపంచం మొత్తం లో పామ్ ఆయిల్‌ని అధికం గా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. ఈ పామ్ ఆయిల్ వెనుక పెద్ద మాఫియా ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో పామ్ ఆయిల్‌నే వాడుతున్నారు.
దీని వెనకున్న కారణం ఏమిటంటే మిగతా వంట నూనెల కంటే పామాయిల్ ధర తక్కువ. పామ్ ఆయిల్‌తో ఆహారం తయారు చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎలాంటిముప్పు కలుగుతుందో తెలియక చాలా మంది ఈ నూనెతో చేసిన వంటకాలు తింటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ,పెద్ద పెద్ద కంపెనీల్లో బిస్కెట్లు, కుకీల తయారీ లో పామ్ ఆయిల్‌నే వాడుతున్నారు. చాక్లెట్స్ తయారీలో కూడా దీన్నే వాడుతున్నారు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాం. కానీ పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ కు మన ప్రాణాలు తీసే శక్తి ఉందన్న సంగతి మనకు తెలియదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, లేస్ లాంటి కంపెనీలు ,విదేశాల్లో అమ్మే ఉత్పత్తులు వండటానికి వేరే వంట నూనె వాడుతూ కూడా ఇండియాలో అమ్మే వాటికి మాత్రం పామ్ ఆయిల్‌ని వాడుతున్నాయని నిపుణులు తెలియచేస్తున్నారు. తెలిపారు.
ఇలా పామాయిల్‌తో తయారు చేసినవి తిన్న ప్రతిసారీ పిల్లల మెదడు దెబ్బతింటూనే ఉంటుంది. పామాయిల్ తో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి.చాలా చిన్న వయసులో షుగర్ వ్యాధి కి గురవుతున్నారు. కాబట్టి పిల్లల కోసం ఏదైనా కొనేటప్పుడు ఆ వస్తువుల్లో పామ్ ఆయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి కలిపినట్లు ఉంటే వాటిని అస్సలు కొన వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.