Water:ఈ సృష్టిలో నీరు అనేది సమస్త జీవకోటికి జీవనదారం అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఆహారం తినకుండా అన్నా కొన్ని రోజులు ఉండగలగవచ్చు కానీ నీరు తాగకుండా మాత్రం అసలు ఉండలేము . నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. ఎక్కువ నీరు తాగడం వలన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు అన్ని బయటకు పోతాయి.అందుకే డాక్టర్లు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని సూచిస్తూ ఉంటారు.నిజానికి ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నీరు తాగితే అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారా.? ఎందుకంటే ఇది అదనపు నీటిని తొలగించే మూత్రపిండాల సామర్థ్యాన్ని నిరోదించడంతో పాటు శరీరంలోని సోడియంను కూడా తక్కువ చేస్తుంది.ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని వెల్నెస్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ అయిన శిఖా శర్మ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎక్కువ నీరు తాగడం వల్ల మన.మూత్రపిండాలు సరిగా పనిచేయవట. అలాగే ఎక్కువ నీరు తాగితే శరీరంలోని కణాలు వాపుకు గురి అవుతాయట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎక్కువ నీరు తాగితే యమా డేంజర్ :
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం అధికం అయ్యి అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే అధిక నీరు వలన శరీరంలోని ఉప్పు స్థాయిలు తగ్గిపోతాయి.తద్వారా వికారం, వాంతులు, తిమ్మిరి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయి తగ్గుతుందా..?
అధికంగా నీరు తాగినప్పుడు శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. ఫలితంగా మన శరీరం అదుపు తప్పుతుంది.శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు తక్కువ అయితే వణకడం, కండరాల నొప్పి, తిమ్మిరి ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అధిక మూత్రవిసర్జన:
ఎక్కువ నీరు తాగడం వలన తరచుగా మూత్రవిసర్జన చెయవలిసిన పరిస్థితి వస్తుంది. ఈ రకమైన పని వలన అందరు కూడా ఇంటా,బయట చాలా అసౌకర్యంగా భావిస్తారు.ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మూత్రపిండాలు కంటిన్యూగా పని చేస్తాయి కావున మీరు రోజూ బాత్రూమ్కి వెళ్ళవలిసిన పరిస్థితి వస్తుంది.
అధిక నీరు అలసటకు కారణమా..?
ఎక్కువ నీరు తాగితే శరీరంలో అలసట, నీరసం వస్తుంది. ఎక్కువ నీరు తాగితే మీ మూత్రపిండాలు మరింత కష్టపడి పనిచేయవలసి రావచ్చు. అలాంటప్పుడు కొన్ని హర్మోన్ల ప్రతిచర్య మీ శరీరాన్ని ఆందోళనకు, అలసటకు గురి చేస్తుంది.అలాగే మనం తాగే నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉంటే మూత్రాశయం, వృషణ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.