Mango: ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన మామిడి పళ్ళు దర్శనం ఇస్తూ ఉంటాయి. మామిడి పండు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే రుచిలో మామిడి పండును మించిన పండు మరొకటి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మామిడి పండును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మామిడి పండు రుచిలోనే రారాజు కాదండోయ్ పోషకాల విషయంలో కూడా రారాజే.మామిడి పండు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అయితే కొందరు మామిడిపండును రాత్రి పూట భోజనం చేసాక తింటూ ఉంటారు.నిజానికి అలా తినడం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.మరి ఆ సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాత్రి పూట మామిడి పండు తింటే కలిగే అనారోగ్యాలు :
సాధారణంగా రాత్రి పూట మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. ఇది తిన్నాగాని త్వరగా జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది.అందుకే రాత్రి పూట తీసుకునే ఆహారం తేలికపాటి ఆహారం అయితే మరి మంచిది. రాత్రి పూట మామిడి పండు తింటే త్వరగా అరగదు. కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది. అతిసారం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.. అలాగే షుగర్ వ్యాధితో బాధ పడే వాళ్ళు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది అసలు తినకూడదు. ముఖ్యంగా మామిడి. పండు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఆహారం తిని మామిడి పండు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మామిడి పండు రాత్రి పూట తింటే బరువు పెరుగుతారా..?
అలాగే ఈ కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కావున రాత్రి పూట అన్నం తిన్నాక మామిడి పండు తిన్నా, మ్యాంగో జ్యూస్ తాగినాగాని విపరీతంగా బరువు పెరుగుతారు.అలాగే మామిడి పండులో వేడి చేసే గుణం ఉంది. మామిడి పండు తినడం వలన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే మామిడి పండును రాత్రి పూట తినడం వలన చర్మ సమస్యలతో పాటు మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మామిడి పండును మధ్యాహ్న సమయంలో తింటే మంచిది.