Weight Loss: ప్రస్తుత జీవన జీవన విధానం లో అందరు కూర్చున్న చోటునుండి లేవకుండానే పని చేసుకుంటున్నారు. ఇలా పని చేసే అందరికి పొట్ట బయటకు తన్నుకు వస్తున్నా విషయం మన అందరికి తెలిసిందే. కూర్చుని పనిచేసేవారికి అలానే ఉంటుంది లే అని వదిలేస్తుంటారు. కానీ అలా వదిలేయడం వలన అనేక రకాల జబ్బులు వచ్చి పడుతున్నాయి. అలా ఎక్కువ గంటలు కదలకుండా కూర్చునే కన్నా కనీసం గంటకి ఒకసారి అయినా లేచి కాసంత అటుఇటు నడిచి వచ్చికూర్చుని పని చేసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. దానితో పాటు ఇంకా ఏమి చేయవచ్చో కూడా తెలుసుకుందాం.
పొట్ట తగ్గించుకోవాలి అని అనుకున్నవారికి ఇంకో చక్కని పరిష్కారం పైన్ ఆపిల్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
1. విటిమిన్ ఏ, బి, సిల ను ఒకేసారి అందించగల ఏకైక పండు పైనాపిల్ . దీన్ని క్రమం తప్పకుండా 40 రోజుల పాటు తీసుకుంటే పొట్టని చాలా సమర్ధ వంతం గా తగ్గిస్తుంది.ఆ ఫలితం చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్య పోతారు. అంత ప్రభావవంతం గా పనిచేస్తుంది. పొట్ట తగ్గడం తో పాటు ముఖం కూడా చాలా కాంతివంతంగా మారుతుంది .
పైన్ ఆపిల్ పీచు, ఇనుము సంవృద్ధిగా కలిగి ఉండడం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. హృద్రోగాలను సైతం అరికడుతుంది.
3. అస్తమా వలన వచ్చే శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కానీ ఈ పండును మోతాదు మించి తీసుకోకూడదు . పెరుగుతో కలిపి ఈ పండును తినవచ్చు. లేదంటే జ్యూస్ చేసుకుని తాగవచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవారు మాత్రం షుగర్ లేకుండా చేసిన జ్యూస్ మాత్రమే తాగాలి.
4. పైన్ ఆపిల్ సెపరేట్గా కాకుండా , ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ గా కూడా డైట్లో చేర్చుకోవచ్చు. పైన్ ఆపిల్ జ్యూస్ లో తేనె కలిపి 40 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి నివారించబడుతుంది.
5. పైన్ ఆపిల్ తీసుకోవడం వలన కంటి సమస్యలు దూరం అవడం తో పాటు దంత సమస్యలు, గొంతునొప్పి,చెవిపోటు, వంటివి కూడా తగ్గుతాయి . దీనితో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. పచ్చకామెర్లు తో బాధపడేవారు, అనాసపండు రసాన్ని తాగితే ఉపశమనం పొందుతారు.
6. రక్తహీనత ఉన్నవారికి పైన్ ఆపిల్ చక్కని పరిష్కారం గా చెప్పబడింది. నొప్పులకు పెయిన్కిల్లర్గా కూడా సమర్ధవంతం గా పనిచేస్తుంది. అయితే పైల్స్ సమస్య ఉన్నవారు , గర్భిణీ స్త్రీలు పైన్ ఆపిల్ తీసుకోకపోవడం మంచిది.