Java Plum: నేరేడు పండు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నేరేడు పండు చూడడానికి నల్లగా ఉంటుంది. మధ్యలో గింజ కూడా ఉంటుంది.ఈ పండు తినడానికి కొద్దిగా పులుపు,తియ్యదనంతో అలాగే కొద్దిగా వగరుగా కూడా ఉంటుంది.నేరేడు పండును పురాతన కాలం నుండి ఎన్నో రకాల వ్యాధులకు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. నేరేడు పండును ఇంగ్లీష్ లో జామున్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో నేరేడు పండు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లు ఎక్కువగా ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియాలో పెరుగుతాయి. అలాగే నేరేడు చెట్టు యొక్క కలపతో తలుపులు, కిటికీలు తయారుచేస్తారు.
Health Benefits: బొప్పాయి పండు తినడం వల్ల కలిగే లాభాలు.. గ్యారెంటీగా తెలుసుకోండి..!!
Java Plum: ఆరోగ్య ప్రయోజనాలు..
నేరేడు పండులో మనకు తెలియని ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నేరేడు పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి, ఫోలీక్ ఆసిడ్ లాంటి విటమిన్లు అధిక మోతాదులో ఉన్నాయి.అలాగే ఈ పండులో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శరీరానికి ముఖ్యమైన అందించడంలో సహాయకరిగా పనిచేస్తుంది. మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుంది. నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్థులకు ఒక గొప్ప వరం అని చెప్పాలి.షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పండును ప్రతి రోజు క్రమం తప్పకుండా తింటే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది.
Health Benefits: వేసవిలో మన శరీరం చాలా కూల్ గా ఉండాలంటే.. ఇవి తింటే చాలు ..!!
అందుకనే షుగర్ వ్యాధి గ్రస్థులు నేరెడు పండును నిరభ్యన్తరంగా తినవచ్చు.అంతేకాకుండా షుగర్ వ్యాధి లక్షణాలు అయిన అధిక దాహం, అధిక మూత్రవిసర్జన వంటి సమస్యలను కూడా నయం చేయడంలో నేరేడు పండు ఎంతగానో సహాయపడుతుంది.ఈ పండ్లను తినటం వలన జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవతుంది.ఈవికాకుండా నేరేడు పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, గుండె పనితీరు మెరుగుపరుస్తుంది నేరేడు పళ్లలో అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి కాబట్టి అవి చర్మానికి మరింత కాంతిని అందిచేస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి ముఖంపై మొటిమల వచ్చే సమస్యను తగ్గిస్థాయి.