మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు పడగడుపున మేము చెప్పే ఈ జ్యూసులు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ జ్యూస్లలో అనేక రకాల పోషకాలతో పాటుగా అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.ఈ జ్యూసులు తాగడం వలన మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి. మరి ఖాళీ కడుపుతో ఎలాంటి జ్యూసులను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ రసం :
దానిమ్మ కాయ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.అయితే పడగడుపున దానిమ్మ రసం తాగితే మలబద్ధకం దూరమవుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది.. అందుకే ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మంచిది
ఉసిరి జ్యూస్ః
ఉదయం పూట ఉసిరికాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మలబద్ధకం సమస్యను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.
సొరకాయ రసం:
సొరకాయ రసంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇంకా రక్తపోటును అదుపులో ఉంచి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే మీ బరువు తగ్గించే ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చుకుంటే మంచిది.