హెల్త్

జుట్టు ఒత్తుగా పెరగాలంటే కరివేపాకుతో ఇలా చేయండి..!

Share

మన భారతీయ వంటల్లో కరివేపాకు లేకుండా వంట అనేది చేయరు. తాలింపు వేయాలంటే కరివేపాకు కూరల్లో పడాలిసిందే. కరివేపాకు కూరకు మంచి వాసనను అందిస్తుంది. అయితే చాలా మంది కరివేపాకులను కూరల్లో రుచి కోసం, వాసన కోసం మాత్రమే వాడతారని అనుకుంటారు. నిజానికి కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది . చాలా మంది కరివేపాకును తినకుండా తీసి ప్రక్కన పెడతారు.కానీ కరివేపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అసలు ఉండరు.కరివేపాకు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణలో కుడా కీలక పాత్రను పోషిస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరి కరివేపాకును ఎలా ఉపయోగిస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృడంగా పెరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకుతో జుట్టుకు ప్యాక్ :

రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి రెండు స్పూన్ల మెంతులను వేసి నానబెట్టాలి.ఆ తర్వాత కలబందని తీసుకొని అందులో గుజ్జుని ఒక రెండు టీ స్పూన్స్ తీసి శుభ్రంగా కడిగి ఉంచాలి. ఇప్పుడు కలబంద గుజ్జు, ముందుగా నానపెట్టుకున్న మెంతులను ఒక మిక్సీ జార్ లో వేయాలి వీటితో. పాటుగా రెండు రెబ్బల కరివేపాకు, రెండు స్పూన్ల పుల్లని పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి.

జుట్టు ఒత్తుగా, దృడంగా పెరగాలంటే..?

ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ముల్తానీ మట్టి కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా రాయాలి.అరగంట తర్వాత షాంపూతో కాకుండా కుంకుడుకాయతో తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు కరివేపాకుతో ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ వలన చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.

 


Share

Related posts

Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎంత డేంజ‌ర‌స్ అనేది మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు!

sridhar

Weight Loss: నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు..!! ఎలాగంటే..!?

bharani jella

కోవిడ్ సరికొత్త లక్షణం .. పురుషాంగం కాస్తా .. వామ్మో !

Kumar