32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
హెల్త్

Bypass Surgery: రెండోసారి “బైపాస్” కి భయం అవసరం లేదు, డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ పరిశోధనలో వెల్లడైన కీలక సమాచారం

Dr Lokeshwara Rao Sajja of Sajja Heart Foundation
Share

Bypass Surgery: ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు. వయసుతో, డబ్బుతో, హోదాతో సంబంధం లేకుండా పరిస్థితులు మారిపోయాయి. లేత వయసులోనే గుండె జబ్బులు వచ్చి చనిపోతున్నారు. ఎంతటి సెలబ్రిటీ అయినా.. మరణాన్ని తప్పించుకోలేకపోతున్నారు. చాలా వరకు దేశంలో గుండెజబ్బుల మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఆరోగ్యం కోసం జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్నవారికి కూడా గుండె జబ్బులు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకానొక సమయంలో చాలా పెద్ద వయసు వారికి గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రావడం దురదృష్టకరం.ఎకువైపోతున్నీ ఒక్కసారి గుండె జబ్బు వస్తే మనిషి తన ప్రాణం మీద ఆశలు వదిలేస్తున్నాడు. ఇంక రెండోసారి బైపాస్ అంటే.. పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే … గుండె జబ్బులు బైపాస్ కి సంబంధించి సరికొత్త టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు రెండోసారి బైపాస్ కి ఏటువంటి చింత అవసరం లేదని ప్రస్తుత సాంకేతికతతో విజయవంతంగా సర్జరీలు జరుగుతున్నట్లు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ పరిశోధనలో వెల్లడయ్యింది.

Dr Lokeshwar Rao Sajja of Sajja Heart Foundation: డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ రెండోసారి బైపాస్ సర్జరీలపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు, పరిశోధనలో దుష్పలితాలు 4 నుంచి 3 శాతానికి తగ్గాయని తేలింది

Bypass Surgery: Sajja Heart Foundation Doctors
Bypass Surgery: Sajja Heart Foundation Doctors say there is no need to fear about a second bypass surgery as new technology has become available

Second Heart: మన శరీరం లో గుండె కంటే ముఖ్యమైన భాగం ఒకటి ఉంది .. ఇది తేడా వస్తే స్పాట్ డెత్ !

చాలావరకు రెండోసారి బైపాస్.. అంటే ప్రాణాలు గాల్లో ఉన్నట్లే. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక విధానాలతో.. రెండోసారి బైపాస్ సర్జరీ, విజయవంతంగా పూర్తి చేయవచ్చని సీనియర్ కార్డియోధోరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా తెలియజేశారు. రీ-ఆపరే టివ్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ట్రెండ్స్ప ఆయన పరిశోధన పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ఏషియన్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ ఆనల్స్ నవంబరు సంచికలో ప్రచురితమైంది. ఇది ఆయన 1005 పరిశోధన పత్రం. సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా నేపధ్యం చూసుకుంటే ..స్టార్ ఆస్పత్రి రీసెర్చ్ డైరెక్టర్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్. రెండోవసారి బైపాస్ సర్జరీ అంటే చాలామంది రోగులు బయపడతారు. కానీ డాక్టర్ సజ్జా ఈ భయా లను తొలగిస్తూ రెండోసారి బైపాస్ సర్జరీలకి సంబంధించి రెండు దశాబ్దాలలో దాదాపు 256 మందికి నిర్వహించిన రెండోసారి బైపాస్ సర్జరీలపై ఆయన విస్తృత పరిశోధనలు నిర్వహించారు.

In Picture: Dr Lokeshwar Rao Sajja of Sajja Heart Foundation
In Picture: Dr Lokeshwar Rao Sajja of Sajja Heart Foundation

ఈ క్రమంలో దుష్పలితాలు 4 నుంచి 3 శాతానికి తగ్గాయని ఆయన పరిశోధనల్లో తేలింది. పైగా ఈ రెండోసారి ‘బైపాస్ ‘లో ఎక్కువ బ్లాక్ లతో అప్పటికే స్టంట్ పడిన వారు, మధుమేహం, వయో భారం, అధిక రక్తపోటు, బ్లడ్ పంపింగ్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి సైతం చేస్తున్న సర్జరీలు విజయవంతం అవ్వుతున్నట్లు తెలిపారు. ఈ పరిశోధనను ‘ఇండియన్ జర్నల్స్ ఆఫ్ థొరాసిక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ’లో ఒరిజినల్ ఆర్టికల్ గా ప్రచురించడానికి భారతీయ సర్వే కూడా ఆమోదించడం జరిగిందట. ఇక ఇదే సమయంలో తన పరిశోధనలు, రచనలను ఇంటర్నేషనల్ స్థాయిలో 2,500 కంటే.. ఎక్కువసార్లు ఉదహరించినట్లు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా తెలియజేశారు. దీంతో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు రెండోసారి బైపాస్ చేయించుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

Heart Disease: మేము చెప్పే ఈ ఆహారం తినండి.. గుండె జబ్బులకు గుడ్ బై చెప్పండి..!


Share

Related posts

Ground Nuts: పల్లీలు తినగానే నీళ్లు తాగకూడదు..!! ఎందుకంటే..!?

bharani jella

Skin Allergy: చర్మం సమస్యలు తగ్గడానికి చక్కని ఇంటి చిట్కాలు.. ఇవి పాటిస్తే చర్మ రోగాలు రమ్మన్నా రావు..!

bharani jella

డెలివరీ తర్వాత చాలా తేలికగా బరువు తగ్గొచ్చు

Kumar