Kidney Disease: శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి.. బిపి, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి.. అయితే డయాబెటిస్, హైబీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది.. మూత్రపిండాల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది.. కిడ్నీలు పూర్తిగా పాడైతే మన ప్రాణాలకే ప్రమాదం.. కిడ్నీలు పూర్తిగా పాడైపోతున్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.. వాటిని గుర్తించి మనం తగిన పరీక్షలు చేయించుకుంటేనే మొదటి దశలోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు.. కిడ్నీల పనితీరు కోసం తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి తెలుసుకుందాం..

Kidney Diseases Symptoms: కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు
కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు: మూత్రపిండాలు పాడైనప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇది.
మన మూత్రంలో రంగు మారినా, మూత్రం లో సాధారణ మార్పులు కనిపించినా మూత్రపిండాల సమస్య తో మనం బాధపడుతున్నామని గుర్తించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే మన ఆకలి మందగిస్తుంది. నోటికి రుచి తెలియదు. రక్తంలో వ్యర్ధాల కారణంగా వికారం, వాంతులు అవుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు కూడా తగ్గుతారు. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వలన శ్వాసకోస సమస్యలు బాధిస్తాయి. తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కిడ్నీల పనితీరు మందగించాయని.. మన శరీరానికి ఇచ్చే సంకేతాలు.. వీటిని గుర్తించి వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కిడ్నీల ఆరోగ్యం పదిలం కోసం ఇవి తినండి..!
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగాలి. శరీరాన్ని డిహైడ్రేషన్ గురికాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలికగా బయటకు వెళ్తాయి. లావుగా ఉండే ఎర్రటి మిర్చిలో విటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి. రెడ్ క్యాప్సికం తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లి కూడా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

కిడ్నీల నుంచి అనవసర వ్యర్ధాలు బయటకు వెళ్లే లాగా వెల్లుల్లి తోడ్పడుతుంది. వెల్లుల్లిని పచ్చిగా తిన్నా లేదంటే కూరల్లో వేసుకుని తిన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆపిల్ పండు తీసుకోవడం వలన కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ కిడ్నీల పనితీరు వేగవంతం చేస్తుంది. పుట్టగొడుగులు లో ఉండే విటమిన్ బి, విటమిన్ బి కిడ్నీ వ్యాధులను దూరం చేస్తాయి. వీటి వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
కిడ్నీల ఆరోగ్యం కోసం ఇవి తినకండి..!
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు అవకాశం ఎక్కువ. అందువలన ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ప్రాసెసింగ్ చేసిన ఆహారలను చిప్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. పంచదార కూడా తక్కువగా తీసుకోవాలి. ఆక్సలేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చిలకడ దుంప, పాలకూర, కాఫీ, చాక్లెట్, సోయా ఉత్పత్తులు, వేరుశనగ లో ఆక్సలైట్లు ఎక్కువగా ఉంటాయి. నాన్ వెజ్ కూడా తీసుకువద్దు. చికెన్, ఫిష్, మటన్, ఫోర్క్ లాంటి మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. వీటిల్లో ఉండే ప్రొటీన్ల వల్ల యూరిక్ యాసిడ్ కాల్షియం ఆక్సలేట్ వలన కిడ్నీ రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎక్కువ. విటమిన్ సి సప్లిమెంట్స్ వల్ల పురుషుల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.
Annatto Seeds: అన్నట్టో విత్తనాల ప్రయోజనాలు, ఇది ఒక సూక్ష్మ పోషకాల నిధి.!