Kisses: అప్‌సైడ్ డౌన్ కిస్ ఈ ముద్దు పెట్టుకున్నారంటే మీరు చాలా రొమాంటిక్ అని అర్ధం .దీని కోసం మీరు స్పైడర్ మ్యాన్‌లా మారిపోవాల్సిందే. ఈ కిస్ మీరున్న పొజిషన్‌కి వ్యతిరేక దిశలోఉండవలిసి వస్తుంది. అలా ఉండి పెట్టుకోవడమే ఈ ముద్దుకి ఉన్న స్పెషల్. వర్షంలో ఇలాంటి ముద్దు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.ఏంజిల్ కిస్ దీనికోసం భాగస్వామి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మృదువుగాపెదాలపై ముద్దు పెట్టాలి . ఇది ప్రేమను, ఇష్టాన్ని చూపేందుకు బాగా పనికి వస్తుంది. మీ లోని స్వచ్ఛమైన ప్రేమను తెలియచేయడానికి ఈ ముద్దు ను వాడుకోవచ్చు.
బ్యాక్ ఆఫ్ ది నెక్ కిసెస్ కి మెడ వెనుకగా జుట్టు కింద ముద్దు పెడతారు. ఇలా పెడితే చక్కటి మూడ్ లో కి వెళ్ళిపోతారు. మెడ వెనుక నుంచి మొదలు పెట్టి వీపుపై వరకూ ముద్దులు పెట్టుకుంటూ వెళ్లడం వల్ల పూర్తిగా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు.టీజర్ కిస్ లో నుదురు దగ్గర ప్రారంభమై అక్కడి నుంచి కింద వరకూ అన్ని భాగాలలో ముద్దులు పెడతారు . బెడ్‌పై వెల్లకిలా పడుకొని ముద్దులు పెట్టుకోవడం వల్ల శృంగారానికి రెడీ అని భాగస్వామికి సిగ్నల్ ఇవ్వటమే .
చేతిపై ముద్దు అనేది అందరు ఉన్నాకూడా ముద్దు పెట్టుకునేందుకు ఇది మంచి పద్ధతి. ఈ ముద్దు మీ భాగస్వామినే కాదు, దగ్గరి వాళ్లను కూడా పెట్టుకోవచ్చు. దీనికోసం ఎదుటివారి చేయి తీసుకొని అరచేతి కి వెనుక ముద్దు ఇవ్వాలి . ఈ స్వీట్ అండ్ సెన్సిటివ్ కిస్ ఎదుటివారిపై మీకున్న ప్రేమను తెలుపుతుంది. బైట్ అండ్ నిబుల్ కిస్ అనేది సాధారణ ముద్దు కి కాస్త వేరుగా ఉంటుంది. ముద్దాడేటప్పుడు మీ భాగస్వామి పెదాలు లేదా బుగ్గలను మృదువుగా కొరకడం ఈ ముద్దు ప్రత్యేకత. రోజుకంటే కాస్త భిన్నంగా మీ రొమాన్స్ కి కాస్త మసాలా జోడించాలంటే దీన్ని ఎంచుకోండి.ఫోర్‌హెడ్ కిస్ లో నుదుటిపై ఇచ్చే ముద్దు తో మాటల్లో చెప్పలేని స్వచ్ఛమైన ప్రేమను తెలియచేయవచ్చు. ఐదు ఏళ్ళు దాటిన ఆడపిల్లలు కానీ మగ పిల్లలని కానీ కేవలం నుదిటిమీద మాత్రమే ముద్దు పెట్టుకోవాలట.. అంత స్వచ్ఛమైనది ఈ ముద్దు.