Categories: హెల్త్

Knee care: ఇవి తింటే మీ కాళ్ళ నొప్పులు చీటికలో మాయం అయినట్లే..!

Share

Knee care: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్యకాలంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎముకలకు సంబందించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రియో ఫ్లోరోసిస్ అనే ఎముకలకు సంబంధించిన వ్యాధి వయసు పెరిగిన వారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో పని లేకుండా 30 సంవత్సరాల వయసు పైబడిన వారు కూడా ఎముకలకు సంబందించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గించుకునే క్రమంలో ఎక్కువగా మందులపై ఆధారపడుతున్నారు. అలా కాకుండా తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారపదార్ధాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..!!

Knee care: పాలకూరలో ఉన్న పోషకాలు :

ఆకుకూరల్లో కెల్లా పాలకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.పాలకూరను ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు దృడంగా మారతాయి. పాలకూరలో విటమిన్ “కె” చాలా ఎక్కువగా ఉంటుంది.ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పాలకూరలో కెంప్ఫెరోల్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది . ఎముకలు బలంగా, దృడంగా ఉండాలంటే ముందుగా కావలిసింది కాల్షియం. పాలకూరలో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.


వాల్ నట్స్ :

వాల్ నట్స్ గురించి మన అందరికి బాగా తెలుసు.వాల్ నట్స్ లో ఉండే సమ్మేళనాలు, పోషకాలు కీళ్ల వ్యాధికి సంబంధించిన వాపును తగ్గిస్థాయి. ఈ వాల్‌నట్స్‌లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.

అల్లంతో మీ నొప్పులు మాటుమాయం :

అల్లం కూడా కాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అల్లంలో ఉండే సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి. అందుకే అల్లంను ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు బలంగా తయారవుతాయి.

పెరుగు, పాలతో ప్రయోజనాలు :

పెరుగు తినడం వలన ఎముకలు పెళుసుగా మారవు. చాలా మందికి పెరుగు, పాలు తాగే అలవాటు ఉండదు. నిజానికి కొవ్వు లేని పాలతో తయారుచేసిన పెరుగులో 30 శాతం కాల్షియం ఉంటుంది. అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది.ఇవి రెండిటి వలన మీ ఎముకలు పెళుసుగా అవ్వకుండా బలంగా ఉంటాయి.

కీర దోసకాయలు

కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.అలాగే వీటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా మీ ఎముకలు బలంగా అవుతాయి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

8 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago