NewsOrbit
హెల్త్

మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా .. వెంటనే ఈ పాయింట్స్ తెలుసుకోండి !

మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా .. వెంటనే ఈ పాయింట్స్ తెలుసుకోండి !

టీనేజ్ పిల్లలు తమకి అన్ని తెలుసునని, అన్నీ చేయగలమని, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరం లేదని భావిస్తూఉంటారు . ఈ ఆలోచనల వలన  చాలా విషయాల లో  తల్లిదండ్రుల మాట వినరు. దాంతో పెద్దలకి , పిల్లలకి మధ్య గొడవలు వస్తూఉంటాయి.

మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా .. వెంటనే ఈ పాయింట్స్ తెలుసుకోండి !

టీనేజ్‌‌ పిల్లల తో మనస్పర్ధలు అనేవి రావడం  చాల సహజం.. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారంటే శారీరకంగా, మానసికంగా కూడా ఎదుగుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు చిన్నగా ఉన్నపుడు  ‘ఇదివద్దు, ఆ  పని ఇలాగే చేయాలి’ లాంటి ఆజ్ఞలు  ఏం మాట్లాడకుండా బుద్ధిగా తల ఊపేసిన చేసినవారు  కూడా, పద్నాలుగూ, పదిహేనుల్లోకి వచ్చే సరికి  మాత్రం చిరాకు ప్రదర్శిస్తారు..

దానిని పొగర ని అనుకోకుండా ఉండడం తల్లిదండ్రులు చేయాల్సిన మొదటిపని, యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలు కొత్త ఆలోచనలతో అవతారం ఎత్తుతారు. ఇంట్లో కొత్తగా పెట్టినఆంక్షలు  నుంచి  స్వతంత్రం, సొంత అభిప్రాయాలకు కాస్త విలువ, వ్యక్తిగత విషయా ల్లో తమకంటూ  కొంత సొంతమైనవి ఉండాలని  కోరుకుంటారు. అలా కోరుకోవడం తప్పు ఏమి కాదు. శరీరం లో కనిపిస్తున్న  మార్పులు, మనం ఇంకా పెద్దవాళ్లం అయిపోయాం అనే ఆలోచన వాళ్లలో ఉండడం వలన ఇలాంటి ప్రవర్తనకి కారణమవుతుంది.

పిల్లలు పాడైపోతున్నారని అనుకొని వాళ్ళని అదుపులో పెట్టాలని  ఎక్కువ ఆంక్షలు పెట్టటం, కఠినంగా వ్యవహరించడం  ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళని చాల సున్నితం గా ఓపికతో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నరు. బయట ప్రపంచాన్ని చూస్తూ వారు తెలుసుకున్నది వేరు. తామ చుటూ ఉన్న పరిస్థితులు వేరు కావడం తో  రెండింటి మధ్య కాస్త నలుగుతుంటారు.

ఆ విషయం ఒక్కటి అర్థం చేసుకోగలిగితే టీనేజర్ల తో ఎలాంటి సమస్య ఉండదు . ప్రతీదానికీ తొందరగా బాధ పడడం,  చిన్న దానికి కూడావెంటనే రియాక్ట్ అవ్వటం  వంటివి టీనేజ్ లోనే ఎక్కువ. ఏ సమస్యనైనా వివరం గా ఆలోచించేంత పరిపక్వత ఉండదు.. చిన్న,చిన్నమాటలని కూడా పెద్ద అవమానం గా భావిస్తుంటారు… మార్కులు తక్కువ వచ్చినా, స్కూల్ లో టీచర్ తిట్టినా, ఇంట్లో టీవీ రిమోట్ దగ్గర అమ్మా నాన్నా కోప్పడిన, ఆఖరికి మొటిమలు ఎక్కువగా వస్తున్నా కూడా అవన్నీపెద్ద సమస్యలు అనుకునే దాకా వెళ్తారు. అందుకే టీనేజ్ లో ఉండే పిల్లల ని పసివాళ్లకన్నా ఎక్కువజాగ్రత్తగా చూసుకోవాలి.

టీనేజ్ లో అడుగుపెట్టిన  పిల్లల్ని అదుపాజ్ఞల్లో పెట్టడం అంటే ఎప్పుడూ వారి ప్రవర్తన గురించి ఎవరికతో పడితే వాళ్ల తో చెప్పి చిన్నబుచ్చడం కాదు.. వాళ్లకు బాధ్యత ఇవ్వాలి. వారు తీసుకున్న బాధ్యత లో నిలబడేందుకు అవసరమైన విషయాలు వారితో మాట్లాడాలి. మనం ఇచ్చే స్వేచ్ఛ వలన వాళ్లు ఎక్కడ చెడుదారులకోసం వాడతారో అన్న భయం పోవాలంటే వాళ్లని మనం నమ్ముతున్నాం అనే నమ్మకం వారికి కలిగించాలి.

తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులు తో చర్చించగల స్వేచ్ఛ వారికి  ఉండాలి.ఇప్పటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం చాలావరకూ తగ్గిపోతోంది. అందుకే ముందుగా మనకూ పిల్లలకూ ఉన్న జనరేషన్ గ్యాప్ నీ, జీవన విధానం లో వచ్చిన మార్పులను గుర్తించాలి. అప్పుడు పిల్లలు చేసే ప్రతి పనీ చెడుగా కనిపించడం తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీ, తల్లిదండ్రులు దగ్గర పిల్లలకీ అహం అడ్డు రాకుండా చేసుకోగలిగితే చాలు. కొత్త హార్మోన్స్, శరీరం లో చోటుచేసుకుంటున్నమార్పులూ, ఆపోజిట్ జెండర్ మీద ఉండే ఆకర్షణ ఇవన్నీ టీనేజ్లో చాల సాధారణ విషయాలు.

ఇవన్నీ తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోవాలిసిన అవసరం లేదు. ఎక్కువగా జాగ్రత్త తీసుకోవటాన్ని కూడా టీనేజ్ పిల్లలుసహించలేరు. అతి ప్రేమ, ఎక్కువ జాగ్రత్త వాళ్లని అనుమానిస్తున్నట్టు అనుకుంటారు. ఎదురు సమాధానాలు చెప్పినప్పుడు కూడా అది వాళ్ల తిరుగుబాటు గా కాకుండా వాళ్ల భావ వ్యక్తీకరణ గానే భావించాలి. ఎక్కువ జాగ్రత్త  తీసుకోవటం వల్ల కూడా పిల్లలు పూర్తిగా  ఆధారపడి  జీవించేవారిగా  మారే అవకాశం ఉంది.

అందుకే పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లాగా  ఉంటూ  స్నేహపూర్వకం గా  మాట్లాడాలి. పిల్లలు చేసే పనుల పై ఉన్న కోపాన్ని వారి పై ఉండే ప్రేమ ను విడివిడిగాచూడాలి . తల్లిదండ్రులు తో  టీనేజర్లకి ఉండే స్నేహ సంబంధాలు బెడిసికొట్టకుండా ఉన్నంతవరకే పెద్దల మాటపై వారికి గౌరవం, భక్తి, భయం ఉండేది. స్నేహం గా మాట్లాడితేనే వాళ్ళు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ వాళ్ల ఇబ్బందులని చెప్పుకోగలుగుతారు. అలా చెప్పినప్పుడు ప్రశాంతంగా  వారిని తిట్టకుండా సమస్య పరిష్కార మార్గాలు చూపిస్తే వారు మీకు  తెలియకుండా ఏమి దాచరు..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri