NewsOrbit
హెల్త్

మీ  పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలంటే  నిపుణుల  సూచనలు తెలుసుకోండి!!

మీ  పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలంటే  నిపుణుల  సూచనలు తెలుసుకోండి!!

పరిక్షల సమయం లో ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు..మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం , పరీక్షల్లో ఎంత బాగా రాశామన్నదేప్రధానం . చాలా మంది పరీక్షల కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక లేకుండా అదేపనిగా చదువుతారు. కానీ మార్కులు అంతంత మాత్రమే.. మరి కొంతమంది పరీక్ష లకు కొన్ని రోజుల ముందునుంచి రాత్రి పగలు చదివేస్తూ ఉంటారు.

మీ  పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలంటే  నిపుణుల  సూచనలు తెలుసుకోండి!!

దీనివలన కూడా పెద్దగా ప్రయోజనం  ఏమి ఉండదు.  పైగా ఇలా విశ్రాంతి లేకుండా చదవడం వలన పరిక్షల సమయానికి ఆరోగ్యం పాడై పరీక్షలు కూడా రాయలేని స్థితికి చేరుకుంటారు. మరి  ఎలా చదివితే పరీక్ష లు బాగా రాస్తారు.. ఎలాంటి నియమాలు పాటించడం వలన ఆరోగ్యం గా ఆనందం గా పరీక్షలు పూర్తి చేయగలుగుతారో తెలుసుకుందాం..  మార్కులు, గ్రేడులు మాత్రమే ప్రతిభకు నిదర్శనం కాదు అని గుర్తు పెట్టుకోవాలి . ఉన్నత స్థాయి ఉద్యోగాలకు టాప్ మార్కులు  ర్యాంకులు, కంటే సబ్జెక్ట్ అవగాహన ముఖ్యం.

కాబట్టి వీలైనంత వరకు స్కూల్ లో గాని కాలేజీ  లో గాని ఈ రోజు అయిన పాఠాన్ని ఆ రోజు మరల  ఒక్కసారి వివరం గా చదువుకుని తెలియని అంశాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది మీకు చాల బాగా ఉపయోగపడుతుంది . ఎందుకంటే మీరు పాఠం అంత అర్ధం చేసుకోవడం వలన ఎలాంటి ప్రశ్న ఇచ్చిన తెలికగా జవాబు రాయగలుగుతారు … అదే  పాఠం అర్ధం చేసుకోకుండా ప్రశ్నలు ,జవాబులు మాత్రమే చదివితే  వాటికీ మాత్రమే సమాధానం చెప్పగలరు.  ఇంకో రకమైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోతారు.  చదువు విషయంలో ఒక్కో విద్యార్థి ఒక్కో విధానాన్నిఅనుసరిస్తారు.

పక్క విద్యార్థి చదివే పద్ధతి లో  కాకుండా  తనదైన శైలిలో చదివితేనే సబ్జెక్ట్‌పై పట్టు దొరుకుతుంది. చదవడం,తో పాటు రాత కూడా  ప్రాక్టీస్ చేయడం, వలన అటు చదివినవి గుర్తు తెచుకున్నట్టు ఉంటుంది సమయానికి రాయడం పూర్తి చేయడం వస్తుంది. వీలైనంత వరకు  చదువును రేపు, ఎల్లుండి అనివాయిదాలు వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం మంచిది . ప్రతి విద్యార్థి రాయబోయే పరీక్షా విధానం , సిలబస్ గురించి ముందుగా అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.

సిలబస్ ఎంతవరకు ? పరీక్ష సమయంఎంతసేపు ? ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? వంటి అంశాల ను తప్పనిసరిగా తెలసుకోవాలి. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ప్రతి సబ్జెక్టు ను ఎంత సేపు చదవాలి, ఏయే అంశాలు ముఖ్యమైనవి, క్లిష్టమైన వాటికీ  ఎంత సమయం తీసుకోవాలి , ఎంత సమయానికి చదవడం ముగించాలి. ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి లాంటి అంశాలపై ఖచ్చితమైన ప్రణాలికను తయారు చేసుకోవాలి. ప్రతీసారి అందులో మార్పులుచేయకుండా ఒకే సమయమును నుపాటించడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు చేతికి ఏది దొరికితే అదితీసి చదివేయడము. నిద్రలేకుండా పడి పడి చదవడం వలన కూడా నష్టమేతప్ప ఎలాంటి ఉపయోజనం ఉండదని గమనించాలి అని నిపుణులు తెలియచేస్తున్నారు

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri