Condom: ఫిమేల్ కండోమ్ ఫ్రీ సైజుల్లో దొరుకుతాయి . ఇవి ఎవరికైనా సరిపోతాయి.కాబట్టి సైజు గురించి ఆలోచించక్కర్లేదు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా ఫిమేల్ కండోమ్ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇది నెలసరి పై ఎలాంటి ప్రభావం చూపించదు. మీరు టాంపూన్లు లేదా మెన్స్ట్రువల్ కప్ ఉపయోగిస్తుంటే కనుక వాటిని తీసిన తర్వాత ఫిమేల్ కండోమ్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఫిమేల్ కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భాన్ని ఆపుతుంది. అలాగే లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధులు, హెచ్ ఐవీ వంటివి సోకవు. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్యాక్ పై ఉన్న సూచనల ప్రకారం ఫిమేల్ కండోమ్ వాడితే ,గర్భం రావడానికి 95% వరకు అవకాశం ఉండదు.ఫిమేల్ కండోమ్ వాడుతున్న మొదటి లో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ వాడుతూ ఉంటే.. నెమ్మదిగా వాటికి అలవాటు పడతారు. మేల్ కండోమ్స్ ఎంత పొడవు ఉంటాయో.. ఇవి కూడా అంతే పొడవు ఉండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. కాబట్టి అసౌకర్యంగా ఉంటుందా అనే సందేహం అవసరం లేదు.
ఫిమేల్ కండోమ్ ఫార్మసీ షాపుల్లో,సూపర్ మార్కెట్, ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి . తెలిసింది కదా ఫిమేల్ కండోమ్ కండోమ్ గురించి.. ఇది చదివిన తర్వాత ఇంకా సందేహాలు ఉండవు. కాబట్టి ఇది అవసరం అనుకున్న ప్రతి స్త్రీకి షేర్ చేసి .. వారిలో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు సందేహాలు పోగొట్టుకోవడానికి సహాయపడండి. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటివి ఎంతో అవసరం అని గుర్తు పెట్టుకోండి.