Condom: ఫిమేల్ కండోమ్స్ మార్కెట్లోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ,మార్కెట్లో ఇవి బాగానే అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో పాటు వీటి విషయంలో ఉన్న కొన్ని సందేహాలు కారణంగా ఫిమేల్ కండోమ్ ఉపయోగించడానికి స్త్రీలు ముందుకు రావడం లేదు. ఇది చదివితే మీకు కచ్చితం గా సందేహాలు ,అనుమానాలు తొలగిపోతాయి. ముందుగా ఫిమేల్ కండోమ్ ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం.
ఫిమేల్ కండోమ్ రావడానికి ముందు అది పెట్టుకునేందుకు మీకు వీలుగా ఉండే పొజిషన్ లో ఉండాలి. బొటనవేలు సాయంతో కండోమ్ ను యోని లోపలికి పంపాలి . ఇలా పెట్టుకునేటప్పుడు కండోమ్ కి ఉన్న రింగ్ మాత్రం బయటకు ఉండేలా చూసుకోవాలి. దీనికి సంబందించిన వివరాలు డెమో చూపిస్తూన్నా వీడియోలు ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మరింత అవగాహన పెంచుకోవాలి. తర్వాత మేల్ కండోమ్, ఫిమేల్ కండోమ్ రెండూ ఒకేసారి ఉపయోగించకూడదు. కారణం ఏమిటంటే ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ కారణంగా కండోమ్స్ చిరిగిపోవడం లేదా జారిపోవడం వంటివి జరుగుతాయి.
ఫిమేల్ కండోమ్ ఒకసారి వాడిన తర్వాత మళ్లీ మళ్లీ దాన్నే వాడకూడదు.
ఫిమేల్ కండోమ్ ధరించి శృంగారం పూర్తి అయిన వెంటనే దాన్ని తీసి వేయడం మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు లైంగిక పరమైన వ్యాధులు సోకకుండా ఉండటంతో పాటు అవాంఛిత గర్భం దాల్చుతామన్న భయం కూడా ఉండదు.అన్నివిధాలా ఇది చాలా సురక్షితం. పొరపాటున కూడా గర్భాశయంలో ఫిమేల్ కండోమ్ ఉండిపోవడం అనేది ఏమి ఉండదు. అసలు ఆ సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఫిమేల్ కండోమ్ నిర్దేశిత సైజులో ఉండటం వలన అది గర్భాశయ ముఖద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళదు.
పాలీ యు రే థేన్ తో ఫిమేల్ కండోమ్ తయారుచేస్తారు. ఈ కండోమ్స్ కు ఉండే రింగ్స్ ను కూడా అదే మెటీరియల్ తో తయారుచేస్తారు. అందుకే అవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో ప్రీ లూబ్రికేట్ కండోమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.