Vaddalu: వడలు, గారెలు తినడానికి రుచికరంగా ఉంటాయి.. ఈ బ్రేక్ ఫాస్ట్ ఇంట్లో ఉంది అంటే అందరూ ఆవురావుమంటూ ఎదురు చూస్తారు.. ఎప్పుడు ఒకే విధంగా చేసుకొని మినప వడలు తిని బోర్ కొట్టిందా అయితే.. ఈసారి కొబ్బరి వడలు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది.. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.. ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి ఇవే తినాలని అనిపిస్తుంది.
కొబ్బరి వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు..
కొబ్బరి కోరు అరకప్పు, బియ్యం ఒక కప్పు, జీలకర్ర ఒక చెంచా, బియ్యప్పిండి పావు కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా..
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్ వేసుకోవాలి.. అందులో బియ్యం వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో కొబ్బరి కోరు , ఉప్పు వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో బియ్యప్పిండి వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి..
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోయాలి.. నూనె బాగా కాగిన తర్వాత.. ముందుగా తయారు చేసుకున్న వడల పిండిని ఒక అరిటాకు లేదా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ తీసుకొని చిన్న చిన్న ఉండలు లాగా చేసుకుని.. వాటిని వడలు లాగా ఒత్తుకొని నూనె లో వేసుకోవాలి.. ఇవి నూనెలో వేయగానే పూరీల్లాగా పొంగుతాయి.. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి వడలను పల్లి చట్నీ తో కానీ అల్లం పచ్చడితో గాని తింటే టేస్టీగా ఉంటాయి..