NewsOrbit
హెల్త్

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం ఏది..!?

ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ ప్రపంచ జనాభాకు ఆదర్శ డైట్ ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం చక్కెర, రెడ్ మీట్ (బీఫ్, మేక గొర్రె మాంసం, పోర్క్) 50 శాతం తగ్గించాలి. రుచులు తగ్గినా, ఆయుష్షు పెంచే ఆదర్శ ఆహారం ఇదేనని లాన్సెట్ చెబుతోంది.

లాన్సెట్ ఆధ్వర్యంలో పనిచేసిన ఒక కమిషన్ గురువారం తమ నివేదిక విడుదల చేసింది. 16 దేశాలకు చెందిన 19 మంది శాస్త్రవేత్తలు, 18 మంది నిపుణులు ఈ కమిషన్‌లో ఉన్నారు. ప్రజల ఆరోగ్యానికే కాకుండా  పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కమిషన్ ఈ డైట్ ప్లాన్ రూపొందించింది.

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరాన్‌మెంట్‌కు చెందిన సునీతా నారాయణ్ ఇండియా నుంచి ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు.

ఆరోగ్యవంతుడైన సగటు మనిషికి రోజుకు 2500 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం అవసరం. ఇందులో 800 క్యాలరీలు ధాన్యాల నుంచీ, 204 క్యాలరీలు పళ్లు, కూరగాయల నుంచీ పొందాలని డైట్ ప్లాన్ చెబుతోంది. రెడ్ మీట్ నుంచి పోందే క్యాలరీలు 30 కి మించకూడదు.

చక్కెర గానీ కొవ్వుగానీ విడిగా కలిపి తయారుచేసే పదార్ధాలకు ఆదర్శ ఆహారంలో చోటు ఉండరాదని డైట్ ప్లాన్ నిర్దేశిస్తున్నది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా రోగాలకు దారి తీస్తున్న కారణాలలో ప్రధానమైనది. ఈ డైట్ ప్లాన్ పాటించడం వల్ల  ఏటా కోటీ పది లక్షల అకాల మరణాలను నివారించవచ్చని లాన్సెట్ తెలిపింది.

ఆరోగ్యకరమైన ఆహారం

ఆహారం              గ్రాములు                   క్యాలరీలు

ధాన్యాలు           232                        811

కూరగాయలు      50                          78

దుంపలు           50                          39

పళ్లు                 200                        126

రెడ్ మీట్           14                           30

చికెన్                29                          62

చేప                  28                          40

కాయ ధాన్యాలు   75                          284

చక్కెరలు           31                           120

 

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment