Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం చేసుకోవడానికి కాస్త శ్రమ అవసరం.. కానీ చాలా తక్కువ సమయంలో.. అది కూడా మిగిలిపోయిన అన్నంతో మెత్తటి దూది లాంటి ఇడ్లీ చేసుకోవచ్చు క్షణాల్లో.. అందుకు కావలసిన పదార్థాలు.. తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!
మిగిలిన అన్నంతో ఇడ్లీ తయారీ విధానం..!
కావలసిన పదార్థాలు : అన్నం ఒక కప్పు, ఇడ్లీ రవ్వ రెండు కప్పులు, పెరుగు ఒక కప్పు, నీళ్లు తగినన్ని, ఉప్పు తగినంత, వంట సోడా పావు టీ స్పూన్..
ముందుగా ఇడ్లీ రవ్వ ను ఒక గిన్నెలో తీసుకొని తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వ లోని నీళ్లు వంపేసి గట్టిగా పిండుకుని ఇడ్లీ రవ్వ ను మరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి..
ఇప్పుడు అన్నం పెరుగు రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు పోసి పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిలో ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ రవ్వ వేసి కలపాలి. అందులో ఉప్పు, వంటసోడా వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండి ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసుకుని పిండి పెట్టీ.. ఇడ్లీ పాత్రలో అర గ్లాసు నీళ్ళు పోసి ఈ ప్లేట్ లో అందులో పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయాలి. దాంతో మెత్తని మృదువైన ఇడ్లీలు తయారు అవుతాయి. అన్నం మిగిలినప్పుడు, ఇడ్లీ పిండి తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఇలా అన్నం తో ఇడ్లీ తయారు చేసుకొని తినవచ్చు. ఈ ఇడ్లీలను సాంబార్ , కొబ్బరి పచ్చడి, కరివేపాకు కారం తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీనీ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…