Relationship: హానికరమైన బంధం ఇలాంటి బంధాల నుంచి బయటపడడం అంత తేలిక ఏమి కాదు. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంటుంది. ఎందుకంటే ఈ బంధంలో ఉండే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మరొకరిని శారీరకంగా లేదా మానసికంగా లేదా రెండు విధాలుగానూ హింసిస్తారు. కానీ తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు వీరికి చాలా టైం పడుతుంది. ఈలోగా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గి , ఆత్మన్యూనతా భావన ఏర్పడుతూ ఉంటుంది. ఫలితంగా ఆ బంధం నుంచి బయటకు రాలేక , మానసికంగా దెబ్బతిని డిప్రెషన్ కి గురి కావచ్చు . కానీ ఒక్కసారి ఈ బంధం నుంచి బయటకు వచ్చి.. తమ జీవితాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వ్యక్తి.. ఆ తర్వాత వచ్చే ఎలాంటి సమస్యని అయినా చాలా ధైర్యంగా ఎదురుకుంటారు.
ఫ్రెండ్స్ ప్రేమికులైతే.. ఒక అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న విషయం, వారికి తప్ప చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఈజీ గా తెలిసిపోతుంది. చూడడానికి చాలా క్యూట్‌గా ఉండే ఈ బంధంలో ఒకరి దృష్టిని మరొకరు ఆకర్షించేందుకు ప్రయత్నించడం, సరదాగా ఆటపట్టించడం, రహస్యంగా మాట్లాడుకోవడం.. చేస్తుంటారు. అయితే తమ బంధాన్ని సీరియస్‌గా తీసుకునే వారు ప్రేమను పెళ్లి పట్టాలు ఎక్కిస్తే టైంపాస్‌గా అనుకున్నవారు మాత్రం అక్కడితోనే ఫుల్స్టాప్ పెట్టేస్తారు.
లోకమంతా మాదే …
కొన్ని జంటలు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. సందర్భం వచ్చిన ప్రతిసారీ పరస్పరం తమ ప్రేమను తెలియపరుచుకుంటూ ఉంటారు. అయితే అది కేవలం ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే భాగస్వామి పట్ల తమకు ఉన్న ప్రేమను అందరి ముందు వ్యక్తం చేసేందుకు కూడా ఈ తరహా వ్యక్తులు ఏమాత్రం ఆలోచించరు. అలాగే తమ బంధానికి, సంతోషానికి అద్దం పట్టేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో సైతం పెట్టుకుంటూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సందర్బాల్లో ఇలాంటి వ్యక్తుల ప్రేమను తట్టుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తుంటుంది కూడా..