Vizag: వైజాగ్ అందాల గురించి తెలుసుకోండి !!

Share

Vizag:  అందమైన   పేరుపాలెం పశ్చిమగోదావరి జిల్లాలో సుప్రసిద్ధమైన సాగరతీరం గా పేరుగాంచింది. 20 కి.మీ.  విశాలమైన బీచ్‌ ,  ఆలయాలు, చుట్టూ ఉన్న సరుగుడు తోటలు, కొబ్బరి తోటలతో కలిసి  ఆహ్వనించే ఈ బీచ్‌    మనస్సుకు ప్రశాంతతని ప్రసాదిస్తుంది  .
విశాఖపట్నం  లో ఉన్న రామకృష్ణ బీచ్ తో పాటు అక్కడ ఉన్న కాళిమాత ఆలయం, మత్స్య దర్శిని వంటివి   కూడా ఉన్నాయి. అయితే ఈ బీచ్ ఈతకు మాత్రం అనుకూలం కాదు.  దీనికి దగ్గరలోనే సబ్ మెరైన్ మ్యూజియం కూడా ఉంది.రుషికొండ బీచ్ విశాఖపట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంది.   సహజమైన వాతావరణంతో ఇసుక తిన్నెలతో,ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది.  ఈతకు, పడవ పోటీలకు  ఇది అనుకూలం.   రుష్యేశ్వరాలయం  ఉన్నది కూడా ఇక్కడే  .

యారాడ బీచ్ చుట్టూ చెట్టు చేమలు పచ్చదనం,బంగారు రంగులో  ఉండే  ఇసుక తిన్నెలు, ఎంతో అందమైన కొండరాళ్ళతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.గంగవరం బీచ్ దగ్గరలో స్టీల్ ప్లాంట్  ఉంది.    ప్రకృతి సహజమైన వాతావరణంతో ఇక్కడ ఉండటం వలన చిత్రనిర్మాణం వంటివి ఇక్కడం  జరుగుతుంటాయి.ముత్యాలపాలెం బీచ్  కు దగ్గరలో శ్యామల కొండ, సాగరతీరం చూడటం  ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.  కొండకు తీరానికి మధ్య సముద్రం వరకు ఉన్న ప్రవాహం ఎల్ షేప్ లో సాగిపోతూ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
కళింగపట్నం బీచ్శ్రీకాకుళంలో   పేరుపొందిన పర్యాటక ప్రదేశం. ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకుల మనసు దోచే  సముద్రతీర ప్రాంతం ఇది . ఇక్కడ లైట్ హౌస్ బౌద్ధ స్థూపం కూడా ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న పురాతనమైన   ప్రశాంతమైన బీచ్.    వంశధార నది సముద్రంలో కలిసే  ప్రదేశము ఇది .  వీక్ ఎండ్  గడపడానికి   ఆహ్లాదకరమైన  ప్రాంతం. బ్రిటిష్ వారి కాలంలో రేవు పట్టణం మూసివేయబడినది. ఈత బీచ్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, కు అనువుగా ఉంటుంది.

భావనపాడు బీచ్ శ్రీకాకుళం, సంతబొమ్మాళి మండలంలో  ఉంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ పర్యాటకులు సేదతీరేందుకు అనుకూలంగా ఉంటుంది.  కవిటి బీచ్ శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరంలో ఉంది.   కొబ్బరి తోటలతో ,జీడిమామిడి చెట్లతో కనువిందు చేస్తూ  కోనసీమను  గుర్తు చేస్తుంది.  పనస, ఇతర పండ్ల తోటలు ఉండడం వలన వాతావరణం  చాలా అందం గా ఉంటుంది.
బారువ బీచ్ విశాలమైన ఇసుకతిన్నెల తో  పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. సముద్ర స్నానానికి అనువైన ప్రదేశం. కనుచూపు మేర ఇసుక తిన్నెలతో  ఉంటుంది.  మహేంద్రతనయ నది సంగమ ప్రాంతం  ఇది .    కొబ్బరి చెట్ల తో  చాలా అందం గా ఉంటుంది. ప్రతిరోజు చుట్టుపక్కల ప్రజలు, పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా సందడిగా ఉంటుంది.


Share

Related posts

Corona: క‌రోనా డెల్టా ప్ల‌స్ మ‌ర‌ణాలు మొద‌లు… బీ కేర్ ఫుల్‌

sridhar

Secret affairs: వివాహేతర సంబంధాలు ముగిసిన పోవడానికి విచిత్రంగా కనిపించే కారణాలు ఇవే!!(పార్ట్ -1)

siddhu

Pregnancy: గర్భంలోని శిశువు ఎక్కువగా కదిలితే ఆ శిశువు అమ్మాయా???

Naina