హెల్త్

మీ పిల్లలకు చిన్న వయసులో నేర్పించవలిసిన అతి ముఖ్యమైన విషయాలు..!

Share

నేటి బాలలే రేపటి పౌరులు అని ఊరికే అనలేదు. ఎందుకంటే ఇప్పటి పిల్లలే రేపటి భావితరం భవితలు.చిన్నతనంలోనే పిల్లలకు మంచి నడవడిక,అలవాట్లు నేర్పిస్తే వాళ్ళు పెద్దాయ్యాక మంచి విద్యా బుద్దులు నేర్చుకుంటారు.పిల్లలకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారికి కొన్ని అలవాట్లను, మంచి విషయాలను చెప్పాలి. మరి చిన్నవయసులో మీ పిల్లలకు నేర్పించాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం.

పెద్దవాళ్ల పట్ల గౌరవ, మర్యాదలతో ఉండడం :

ముందుగా పిల్లలకు అందరినీ గౌరవించడం నేర్పించాలి.చిన్నప్పటి నుంచి ఈ అలవాటు నేర్పించడం వలన వారు పెద్దయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది.మీ పిల్లలు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ వారి పట్ల మర్యాదగా ఉంటే చుట్టూ ఉన్న ప్రజలు కూడా వారిని ప్రేమగా, గౌరవంగా చూస్తారు.

వ్యక్తిగత పరిశుభ్రత :

పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, చేతులు కడుక్కోవడం, రోజూ స్నానం చేయడం, పొద్దునే బ్రష్ చేయడం, బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు నీళ్లు పోసి చేతులను కడుక్కోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వారికి ముందు నుండి అలవాటు చేయాలి.

స్నేహపూర్వకమైన భావంతో మెలగడం :

పిల్లల అభివృద్ధికి పునాది అనేది బాల్యంలోనే దృడంగా వేయాలి. మీ పిల్లల ఎదుగుదల,అభివృద్ధిలో వారి స్నేహితుల పాత్ర చాలా ఉంటుంది. స్నేహితులను ఎంచుకునే క్రమంలో పిల్లలు ఎల్లప్పుడూ మంచి పిల్లలతోనే స్నేహంగా ఉండాలని చెప్పాలి. మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని చెప్పాలి.

పిల్లల పెంపకంలో తల్లి తండ్రుల పాత్ర :

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులకు కోప్పడుతుంటారు. కానీ, అలా చేయడం మంచి పద్ధతి కాదు. పిల్లలకు ఏదైనా సరే సున్నితంగా చెప్పాలి వారి మనసుపై ప్రభావం చూపకుండా చూడాలి.ఎలాంటి పరిస్థితి వచ్చినా వారిని ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని మంచి, చెడులు చెప్పాలి.

 


Share

Related posts

వర్షాకాలం వచ్చింది అంటే మీ ఇంట్లో ఈ కూరలు ఉండాల్సిందే !

Kumar

Rice Tea: రైస్ టీ టెస్ట్ చేశారా..!? ఈ ప్రయోజనాలు మీకోసం..!!

bharani jella

Diabetes: డయాబెటిస్ తో వచ్చే పాదాల సమస్యలు తగ్గించుకొండిలా..!!

bharani jella