NewsOrbit
హెల్త్

లెమన్ డిటాక్స్ మంచిదేనా!?

<span style=font size 16px>శరీరంలో పేరుకున్న విషపదార్ధాలను క్రమం తప్పకుండా తొలగించాలని కొందరు నమ్ముతుంటారు అలాంటివారు కొన్ని రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం నిమ్మరసం తేనె సేవిస్తారు దాని వల్ల శరీరంలో మలినాలు తొలగిపోయి మళ్లీ ఆరోగ్యకరంగా తయారవుతుందని వారి విశ్వాసం ఇందులో ఎంతమేర నిజం ఉంది<span>

ఈ తరహా చిట్కాలను డిటాక్స్ అంటారు. టాక్సిన్స్ (విషపదార్ధాలు)ను తొలగించే ప్రక్రియ డిటాక్సిఫికేషన్. శరీరంలోని ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు, ఇతర విషపదార్ధాలను తొలగించేందుకు వైద్యులు ఈ ప్రక్రియ చేపడతారు. అందుకు వారు కొన్ని ఔషధాలను వినియోగిస్తారు. ఈ సూత్రం ఆధారంగా కేవలం కొన్ని నియమిత ఆహారాలను మాత్రమే తీసుకుంటే శరీరం మాలిన్యరహితంగా తయారవుతుందన్న నమ్మకం చలామణీలో ఉంది. ఇలాంటి పని చేసే ఆహారాలను క్లుప్తంగా డిటాక్స్ అంటారు. నిమ్మరసం డిటాక్స్ తీసుకున్నందువల్ల శరీరం కాంతివంతంగా తయారవుతుందనీ, బరువు తగ్గుతారనీ అంటారు. ఈ డిటాక్స్‌ నిజంగా ఆ పని చేస్తుందా?

లెమన్ డిటాక్స్ వల్ల ఒరిగేదేమీ ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. డిటాక్స్ ప్రక్రియకూ శరీరం పనిచేసే విధానానికీ సంబంధం లేదని వారు అంటున్నారు. డిటాక్స్‌తో సంబంధం లేకుండానే శరీరం దానంతట అదే మాలిన్యాలను విసర్జిస్తుంది. ఆల్కహాలు, బాక్టీరియా, కాలుష్యకారక పదార్ధాలనూ, ఆహారం జీర్ణం అయిన తర్వాత మిగిలే వ్యర్ధాలను ఎలా విసర్జించాలో శరారానికి బాగా తెలుసు.  శరీరంలోని పేగులు, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఎడతెగకుండా చేసే పని అదే.

లెమన్ డిటాక్స్ తీసుకున్నందు వల్ల పైన చెప్పిన శరీరావయవాలు మరింత సమర్ధవంతంగా ఆ పనులు చేస్తాయన్నది భ్రమ. పైగా ఆటంకం కలిగించవచ్చు. లెమన్ డిటాక్స్‌లో పోషకాలు, పీచు ఉండవు. ఆ కారణంగా శరీరం నిర్వహించే ప్రక్రియలు మందగిస్తాయి. లెమన్ డిటాక్స్ తీసుకుంటున్నపుడు శరీరంలోకి ఘనపదార్దాలు వెళ్లవు కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది బరువు తగ్గేందుకు అరోగ్యకరమైన పద్ధతి కాదు.

డిటాక్స్‌ తీసుకున్నందువల్ల గాస్ట్రో సమస్యలు రావచ్చు. తలనొప్పి, బలహీనత, డీహైడ్రేషన్, పోషకాహారలోపం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. మధుమేహం, గుండె జబ్బు ఉన్న వారు డిటాక్స్ వాడడం మరీ హానికరం. వయసులో ఉన్నవారికి కూడా ఇది ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ప్రమాదం ఉంది.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment