Lemon Turmeric: పసుపు చక్కటి యాంటీబయోటిక్ గా పనిచేసి మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే.. నిమ్మ లో ఉండే విటమిన్ సి మనకు రోగనిరోధక శక్తిని పెంపొందించి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది.. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. మన ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

నిమ్మకాయ రసంలో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా తేనెను కూడా జత చేసుకోవచ్చు. ఈ రెండింటినీ ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. దీంతో కాలేయం ను శుభ్రపరచి ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

అధిక బరువు తో బాధపడుతున్న వారు నిమ్మ, పసుపు తీసుకోవడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం పరగడుపున నిమ్మరసంలో తేనె కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యాన్ని పదిలం గా ఉంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దీనిని ఫేస్ మాస్క్, ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు.