ట్రెండింగ్ హెల్త్

ఆరోగ్యం విషయంలో ఈ త‌ప్పులు చేస్తే.. భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు!

Share

మ‌న ఆరోగ్యం గురించి ఎంత శ్ర‌ద్ద తీసుకున్నా.. కొన్ని కొన్ని సార్లు మ‌నం చేసే చిన్న పొర‌పాట్ల వ‌ల‌న మ‌న శ‌రీరంలో మ‌న‌కు హాని చేసే ప‌దార్థాలు వ‌చ్చిప‌డ‌తాయి. ఈ పొరపాట్ల వ‌ల‌న‌ క్యాన్సర్ వంటి రోగాలు సైతం వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంది. అందుకే భోజనం వండేటప్పుడు, తినేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అంతే కాకుండా టైంకు ఆహారాన్ని తీసుకోవాలి. అలా చేస్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. లేక‌పోతే రోగాల భారిన ప‌డే అవ‌కాశం ఉంది.

మ‌నం అమితంగా ఇష్ట‌ప‌డే ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్‌స్టంట్‌ ఫుడ్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డం చాలా మంచిది. కూరగాయలు, పండ్లు, ధాన్యాన్ని తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం. అలాగే ఇంపోర్టెడ్ పండ్డు, కూర‌గాయలు, ఇత‌ర ధాన్యాలు మంచివే కానీ.. మన శరీరతత్వానికి సరిపోక‌పోవ‌చ్చు. అందుకే మ‌నం ఇలాంటి పొర‌పాట్లు చేయొద్దు. రెగ్యుల‌ర్‌గా ఆహారాన్ని టైంకు తీసుకోవాలి. లేక‌పోతే.. అలసట, బద్ద‌కం, లో బీపీ, తలనొప్పి లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆహారాన్ని టైంకు తీసుకోక‌పోతే.. మ‌న‌కు పోష‌కాల కొర‌త ఏర్ప‌డుతుంది. పోష‌కాల కొర‌త ఏర్ప‌డితే ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అందుకే టైంకు భోజ‌నం చేయాలి. తిన్న‌ప్పుడు ఎక్కువ‌గా.. లేక‌పోతే అస‌లే తిన‌కుండా ఉండ‌టం మంచిది కాదు. టైం కు ఇంత తిన‌డం చాలా మంచిది. అలాగే ఆక‌లి అవుతుందని ఫాస్ట్ ఫుడ్ తిన‌డం మంచిది కాదు. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే మాత్రం టైంకు తినాల్సిందే. లేక‌పోతే బ‌రువు ఎక్కువ‌వుతారు. ప‌లు రోగాలు వ‌స్తాయి.

పండ్లు, కూరగాయల‌ను కడగకుండా అస‌లు తినొద్దు. పండ్లు, కూరగాయలపై అనేక ర‌కాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. అంతేకాకుండాఆ చీడపీడల నివారణ కోసం పంటపొలాల్లో చల్లే రసాయనాలు కూడా వాటిపై పేరుకుపోయి ఉంటాయి. అవి మ‌న‌కు హాని చేస్తాయి. అందుకే క‌డుక్కుని తినాలి. అలాగే చెడిపోయిన ప‌దార్థాల వాస‌న చూడొద్దు. అవి మీకు హాని చేస్తాయి.


Share

Related posts

Rajamouli – Mahesh babu : ఆఫ్రికా అడవుల్లో అతిపెద్ద యాక్షన్ డ్రామా రాజమౌళి _ మహేష్ బాబు సినిమా..

bharani jella

రుచి కోసం ఇలా చేస్తున్నారా..? అయితే ముప్పే.. అంటున్న నిపుణులు..!

bharani jella

ఇప్పటి వరకు ఏ బుల్లితెర కమెడియన్ కు రాని అవార్డ్.. సద్దాం సొంతమైంది

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar