Fish: చేపలను కొనే సమయంలో అవి తాజా గా ఉన్నాయా లేదా పాడైన వి తీసుకుంటున్నామా అని చూసుకుని తీసుకోవాలి. తాజా చేపలు అవునా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఫాలో అయితే సులువుగా తెలుసుకోవచ్చు చేపల్లో కొవ్వు తక్కువగా ఉండడం తో పాటు పోషకాలు ఇక్కువగా ఉంటాయి అని చాలామంది మటన్, చికెన్ కంటే చేపలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
చేపలను ఆహారంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ,బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి . అందుకే తాజాగా ఉండే చేపలు తింటే అనారోగ్య సమస్యలు దూరం గా ఉంటాయి.
చేపలను వాసన చూసి కూడా అవి తాజాగా ఉన్నాయా, పాడైపోయినవా అనే విషయాన్ని తెలుసుకోవాలి. చేపలు గుర్తించడంలో ఇదే మంచి మార్గమని నిపుణులు అంటున్నారు. వాసన చూసే సందర్భంలో మీకు దానిలో నుంచి సముద్రపు నీరు వాసన వస్తే అవి తాజా చేపలని తెలుసుకోవాలి. అలా కాకుండా దుర్వాసన గా అనిపిస్తుంటే అది పాడైపోయిన చేపలు అని గుర్తించాలి. చేపల కళ్లపై తెల్లటి పూత కనిపిస్తున్న , కళ్ళు లోతుగా ఉన్న.. చేపలు పాడైనట్టు గుర్తించాలి. తాజా చేపలకు కళ్లు ప్రకాశవంతంగా, ఉబ్బినట్లుగా ఉంటాయి . ఇలాంటివి గమనించుకుని చేపలు కొనుక్కోవాలి అని నిపుణులు తెలియచేస్తున్నారు.
తాజాగా ఉంటే చేపల ఆకృతి లొపల, బయట కూడా ఒకేలా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా చేపల చర్మం మీద ఏదైనా క్రస్ట్ ఉంటే పాడైపోయింది అని అర్థం. ప్రాణం లేకుండా చాలా రోజుల పాటు నిల్వ ఉంచారు అని గుర్తించారు. తాజా చేపలు కోసిన తర్వాత వాటి మాంసం నీట్ గా కనిపిస్తుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలు పాటించి తాజా చేపలు కొనుక్కోవాలి.