NewsOrbit
హెల్త్

Couple: లాస్ట్ టైం మీరు ఎప్పుడు శృంగారం చేశారు అనే ప్రశ్నకు తడుము కొంటున్నారా ?అయితే ఇది మీకోసమే !!

Couple: ఇద్దరు వ్యక్తులు కలిసి  జీవితాన్ని పంచుకునే క్రమంలో శృంగారం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శృంగారం  మీ ఇద్దరినీ  మానసికంగా, శారీరకంగా కనెక్ట్ అయి ఉండేలా చూస్తుంది. ఇద్దరు వ్యక్తుల్ని కలిపేది ఏదైనా ఉంది అంటే అది  ప్రేమ  తర్వాత శృంగారం అని చెప్పక తప్పదు.  లాస్ట్ టైం మీరు ఎప్పుడు  శృంగారం చేశారు అని అడిగినప్పుడు.. సమాధానం చెప్పడానికి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మాత్రం    మీ  ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ కి    కారణమేంటో మీరు ఆలోచించడం  చాలా ముఖ్యం .

అలాంటి కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం. ఆందోళన,  ఒత్తిడి, ఆత్మగౌరవ సమస్య మీ ఇద్దరిలో   శృంగార కోరికలు తగ్గించే  ముఖ్యమైన  కారణాలలో   ఇవి కూడా ఉంటాయి. పనిలో ఒత్తిడి ఉండడం , రోజువారీ  జీవన పద్ధతులలో   తీరిక లేకుండా ఉంటే శృంగారం లో  పాల్గొనాలని  అనిపించినా  మనసు, శరీరం బాగా   అలసిపోయి ఉండటం వలన చేయలేకపోవచ్చు.అలాంటి  సందర్భాలలో ఉత్సాహం , ఆసక్తిని పెంచుకోవడానికి సరైన మార్గం ఎంచుకోవాలి. లేదంటే ఎదో   చేసాం  అన్న విధంగా   ముగిస్తే  అది మీ భాగస్వామి పట్ల ఓ బాధ్యత   పూర్తి చేసినట్లు అవుతుంది. ఇలా చేయడం  వలన ఇద్దరు ఆశక్తి  కోల్పోతారు.
కనీసం సంతోషంగా ఉండాలని ఆలోచించడం కూడా కష్టంగా  మారుతుంది .  ఒత్తిడి మిమ్మల్ని  పూర్తిగా లొంగదీసుకోవడానికి ఆర్థిక సమస్యలు, అభద్రత కారణాలుగా ఉంటాయి.  మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవలు మీరు పట్టించుకోకుండా వదిలేస్తే  మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కాబట్టి ఏదైనా సమస్య వస్తే  వెంటనే పరిష్కరించుకోండి. అప్పుడు   గొడవలు మీ  శృంగార జీవితాన్ని దెబ్బతీయకుండా ఉంటాయి.  ఇద్దరిలో ఏ ఒక్కరికి శృంగారం మీద  ఇష్టం పోయిన.. పెద్దగా కోరికగా  లేకపోయినా  అది రెండో వారిని  బాధ పెడుతుంది.   భాగస్వామిని మోసం చేయడం, అబద్ధం చెప్పడం.. ద్రోహానికి పాల్పడడం లాంటి విషయాలు  మీ జీవితం నుంచి శృంగారాన్ని  దూరం చేస్తాయి.  ఇలాంటివి జరిగినప్పుడు  శారీర సాన్నిహిత్యం కంటే కూడా మీ మధ్య ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకునే విధంగా ప్రయత్నం చేయాలి.

ఒకరి తప్పులు ఇంకొకరు ఎత్తి చూపుతుంటే లైంగిక క్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. తీవ్ర వైముఖ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివి  కాకుండా ఒకరిమీద ఒకరు  నమ్మకాన్ని పెంచుకునే  విధంగా అడుగులు వేయాలి.  మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఆరోగ్యవంతమైన శృంగార జీవితానికి  గొడ్డలి  వేటు వంటిది.  పోర్న్ చూడడం వల్ల భాగస్వామి నుంచి విచిత్రమైన శృంగారాన్ని కోరుకోవడం జరుగుతుంది.  ఇది మీ బంధం యొక్క   సున్నితత్వం దెబ్బతీస్తుంది.
శరీరంలో    ప్రోగోస్టెరోన్,ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరోన్ హార్మోన్ అసమతుల్యత శృంగార సామర్ధ్యాన్ని , శక్తిని తగ్గేలా చేసి    శృంగార జీవితంలో నాణ్యతను  తగ్గించడంతో పాటు అనాసక్తి  కలిగేలా చేస్తుంది .కాబట్టి  మీ ఇద్దరిలో  ఎవరికి శృంగారం లో అనాశక్తి  కలిగిన అసలు కారణం కనిపెట్టి దాన్ని పరిష్కరించుకోవడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri