నడి వయస్కులకు నడుము భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకోవడానికీ, మెదడు చురుకుదనానికీ మధ్య లింకు ఉందని ఒక అధ్యయనంలో తేలింది. వయస్సు పెరిగేకొద్దీ బుర్ర చురుకుదనం తగ్గడం, నడుం భాగంలో కొవ్వు ఎక్కువ ఉన్నపుడు మరింత వేగంగా సంభవిస్తుందని అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
64 ఏళ్ల సగటు వయస్సు వ్యక్తులలో పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయిన వారికీ, కొవ్వు కాకుండా కండరాలు ఎక్కువ ఉన్న వారికీ మధ్య మెదడు ఆరోగ్యంలో వ్యత్యాసాలను ఆరేళ్ల పాటు ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఎక్కువ కొవ్వు ఉన్నవారికి మెదడు చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి పూర్తి వ్యతికరేకంగా ఎక్కువ కండరాలు ఉన్నవారిలో మెదడు చురుకుదనం సహజంగా తగ్గే రేటు కూడా మందగిస్తున్నట్లు కనబడింది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.